కరోనా కిట్స్ తయారీలో సీసీఎంబీ ముందడుగు

Update: 2020-03-29 11:09 GMT
కరోనావైరస్ నిర్ధారణ పరీక్ష చేయడానికి ప్రస్తుతం దేశంలో సరైన వైద్య పరికరాలు లేవు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.   ప్రస్తుతం - కరోనా వైరస్ పరీక్షా  వైద్య పరికరాల కు దేశంలో తీవ్రమైన కొరత ఉంది. అందుకే కరోనా పాజిటివ్ అని తేల్చడానికి సమయం, రోజులు పడుతోంది. బాగా లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్ష చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు.. వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నవారికే టెస్ట్ చేస్తున్నారు. ఒక్కో కరోనా టెస్ట్ కిట్ ను భారత్ ఏకంగా విదేశాల నుంచి  4,500 రూపాయల చొప్పున కిట్లను దిగుమతి చేసుకుంటోంది.

భారతదేశంలో కేవలం 118 ప్రభుత్వ ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయి. 50 ప్రైవేట్ ల్యాబ్‌ లను కూడా ప్రవేశపెడతామని కేంద్రం చెబుతోంది.  130 కోట్ల జనాభాకు ఇవి ఏమాత్రం సరిపోవు.. భారతదేశం మరెన్నో ల్యాబ్‌ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు టెస్టింగ్ కిట్లు కోట్లు కావాలి. అంత భరించడం ప్రభుత్వానికి భారమే.  పైగా కిట్స్ పై సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వాలి. వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశలో ప్రవేశించకముందే ఇవన్నీ జరగాలి.

అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) ప్రత్యేక కిట్‌తో బయటకు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రెండు, మూడు వారాల్లో కరోనా వైరస్ పరీక్షించడానికి  వీరు రూపొందిస్తున్న కిట్ ఫలితాలు ఇచ్చేలానే కనిపిస్తోంది. వెయ్యి రూపాయల కన్నా తక్కువకు ఈ కిట్ మనకు అందుబాటులోకి వస్తుంది.  100 శాతం ఫలితం వస్తేనే ఇవి ఆమోదించబడుతాయి. అందుకే తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News