గే వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో పిల్‌ వేసిన హైదరాబాద్‌ గే జంట!

Update: 2022-11-25 23:30 GMT
స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై నవంబర్‌ 25న విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలోనే తీర్పు ఎలా ఉండనుందనే దానిపై నెటిజన్లలో, గే సమూహాల్లో చర్చ జరుగుతోంది. తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని గే జంటలు ఆశిస్తున్నాయి.

ప్రత్యేక వివాహ చట్టం(1954)లో స్వలింగ సంపర్కుల వివాహాల గురించి ప్రత్యేక ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు వేసిన పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

హైదరాబాద్‌కు చెందిన పిటిషనర్లు సుప్రియో చక్రవర్తి మరియు అభయ్‌ డాంగ్‌ దాదాపు 10 సంవత్సరాలుగా జంటగా ఉన్నారు. రెండవ వేవ్‌ సమయంలో వారిద్దరికీ కోవిడ్‌ వచ్చింది. వీరితోపాటు వీరి కుటుంబ సభ్యులకు సైతం సోకింది.

వారు కోలుకున్న తర్వాత, వారి వార్షికోత్సవం సందర్భంగా వారి ఆప్తులు, సన్నిహితులతో వివాహ-కమిట్‌మెంట్‌ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2021లో ఈ గే జంట ఎంగేజ్‌మెంట్‌ జరుపుకుంది, అక్కడ వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు వారి సంబంధాన్ని ఆశీర్వదించారు. అయితే గే వివాహాలకు ఇప్పటివరకు దేశంలో చట్టబద్ధత లేకపోవడంతో గే జంట సుప్రియో చక్రవర్తి, అభయ్‌ డాంగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తమకు లాగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న గే జంటలకు చట్టబద్ధత కల్పించాలని తమ పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకోనుందో నవంబర్‌ 25న వెల్లడి కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News