మళ్లీ వార్తల్లో నిలిచిన హైదరాబాద్ మేయర్

Update: 2021-04-04 11:30 GMT
రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. కూకటపల్లి నియోజకవర్గం కేపీ.హెచ్.బీ కాలనీ ఏడో ఫేజ్ లో నూతనంగా నిర్మిస్తున్న ఆర్.యూ.బీ పనులను మేయర్ పరిశీలించారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్, స్థానిక అధికారులు ఉన్నారు. అధికారులు తీసుకున్న చర్యలను మేయర్ అభినందించారు.

అయితే ఆర్.యూ.బీ ప్రారంభోత్సవానికి మేయర్ అన్ని ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు, డివిజన్ కార్పొరేటర్ కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఇద్దరూ కూడా అధికార టీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం. అయినా సమాచారం ఇవ్వకపోవడం ప్రోట్రోకాల్ నిబంధనలు ఉల్లంఘించడమేనన్న చర్చ సాగుతోంది.

మేయర్ ఒంటెద్దు పోకడలతో పోతోందని.. సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోవడం లేదనే ప్రచారం అక్కడ జోరుగా సాగుతోంది. మేయర్ ఇప్పటికైనా నేతలను కలుపుకొని పోతారా? సొంతంగా వెళతారా? అన్నది వేచిచూడాలి.


Tags:    

Similar News