లాక్ డౌన్ ఎఫెక్ట్ : హలీం ప్రియుల కు చేదువార్త !

Update: 2020-04-21 15:30 GMT
ముస్లింలకు అత్యంత ముఖ్యమైన రంజాన్ మాసం మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇక ఈ రంజాన్ అనగానే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ..  హలీం.  ఈ రంజాన్ మాసం లో హైదరాబాద్‌ లో ఏ గల్లీ వైపు తొంగి చూసినా.. హలీం ఘుమఘమల వాసన వస్తుంటుంది. రంజాన్ నెలంతా ముస్లింలతో పాటుగా  హైదరాబాద్ వాసులంతా హలీమ్ తినేందుకు క్యూ కట్టి - లొట్టలేసుకుంటూ తింటారు. పలు రెస్టారెంట్లు హలీంను డోర్‌ డెలివరీ కూడా చేస్తుంటాయి.

చికెన్ - మటన్ - వెజ్ హలీమ్‌ లను లొట్టలేసుకుంటూ తింటుంటారు. నగర వాసులకే కాదు హైద‌రాబాద్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐట‌మ్స్ లో హ‌లీమ్ ఒక‌టి. రంజాన్ మాసంలో మాత్ర‌మే దొరికే హ‌లీమ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఉండ‌రు. చాలామంది హ‌లీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హ‌లీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.మంచి రుచితో పాటు...ఉప‌వాస స‌మ‌యంలో ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన‌.. శక్తిని కూడా అందివ్వ‌డమే హలీమ్ ప్రత్యేక‌త‌.  రంజాన్ మాసంలో తెల్లవారుజాము నుంచి ఉపవాసం ఉండేవారు.. సాయంత్రం ఈ హలీం తింటే వెంటనే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయని దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో రంజాన్ మాసంలో ఈ హలీంకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

అయితే , ఈసారి  రంజాన్‌ మాసంలో హలీం ప్రియులకు హలీం మేకర్ అసోసియేషన్ చేదువార్త  చెప్పింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నందున ఈ సారి హలీం తయారు చేయడం కానీ అమ్మడం కానీ ఉండదని ప్రకటించింది.దీన్ని బట్టి చూస్తే ఇక  ఈ ఏడాది హలీంను రుచి చూసే అవకాశం దాదాపు లేనట్టే.  హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహద్ అబ్దుల్ మజీద్ దీనిపై ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు.
Tags:    

Similar News