ఆ విమానం ఎక్కిన దేవ‌త‌

Update: 2017-07-06 05:06 GMT
దేవ‌త ఏంటి? ఫ‌్లైట్ ఎక్క‌టం ఏమిటి? అని క‌న్ఫ్యూజ్ అవుతున్నారా? ఇదంతా స‌ర‌దాగా అనుకుంటున్నారా? అయితే.. త‌ప్పులో కాలేసిన‌ట్లే. నిజంగానే ఒక దేవ‌త విమానం ఎక్కేసింది. బిజినెస్ క్లాస్ లో ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో.. వంద‌మంది భ‌క్తుల‌తో విమానం ఎక్కిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ.. ఆ దేవ‌త ఎవ‌రు? ఆమె విమానం ఎక్కింది? దేవ‌త‌కు జ‌ర్నీ చేసే అవ‌కాశం క‌ల్పించిన విమాన‌యాన సంస్థ ఏది? అన్న క్వ‌శ్చ‌న్ల‌కు స‌మాధానం వెతికితే..

చైనా ప్ర‌జ‌లు మ‌జు అనే స‌ముద్ర దేవ‌త‌ను కొలుస్తుంటారు.ఈ అమ్మ‌వారి విగ్ర‌హాన్ని మ‌లేషియా.. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌ల‌కు తీసుకెళ్లారు భ‌క్తులు. చైనాలోని పుజియాన్ ప్రావిన్స్ కు చెందిన భ‌క్తులు ఈ ఆరు అడుగుల అమ్మ‌వారి విగ్ర‌హాన్ని మ‌లేషియాకు తీసుకెళ్లేందుకు వీలుగా జియామెన్ ఎయిర్ లైన్స్ ను సంప్ర‌దించారు.

దీనికి స‌ద‌రు విమాన సంస్థ ఓకే చేసింది. దీంతో.. అమ్మ వారి విగ్ర‌హాన్ని.. ఆమెతో పాటు ఇత‌ర విగ్ర‌హాల‌తో పాటు భ‌క్తులు సైతం మ‌లేషియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. దేవ‌త విగ్ర‌హంతో పాటు.. 130 మంది భ‌క్తుల బృందం కూడా విమానంలో ప్ర‌యాణించింది.

ఇదిలా ఉంటే.. విమానం దిగిన భ‌క్త‌బృందం త‌మ దేవ‌త‌ను మోసుకెళ్లిన వైనాన్ని చూసిన కౌలాలంపూర్ విమాన సిబ్బంది ఆశ్చ‌ర్యానికి గుర‌య్యార‌ట‌. ఆ త‌ర్వాత విస్తృత స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హించి.. దేవ‌త విగ్ర‌హం కార‌ణంగా ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేల్చి.. బ‌య‌ట‌కు తీసుకెళ్లేందుకు అనుమ‌తించార‌ట‌. మొత్తానికి దేవ‌త‌ ఫ్లైట్ జ‌ర్నీ చేసిన ఎపిసోడ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News