ఇవ‌న్నీ రేవంత్‌ పై బుక్క‌యిన కేసులే!!

Update: 2018-09-27 17:25 GMT
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి ఇండ్లపై జరుగుతున్న ఐటీ దాడుల అంశం తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. అమెరికా, హాంకాంగ్‌, మలేషియాల్లోనూ రేవంత్‌ రెడ్డి ఆస్తులు సంపాదించినట్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ప్ర‌చారం జ‌రుగుతోంది.  2014కు ముందే బ్లాక్‌మనీతో మలేసియాలో ఆస్తులు కొన్నట్లు  రేవంత్‌ పై ఆరోపణలున్నాయి.  మలేషియాలో ఆస్తులను ఐటీ రిటర్న్‌లో గానీ - ఎన్నికల అఫిడవిట్‌ లో గానీ పేర్కొన లేదంటున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించి లోతుగా కూపీ లాగిన ఐటీ అధికారులు.. రేవంత్‌ రెడ్డికి చెందిన రెండు విదేశీ బ్యాంక్ అకౌంట్లను కనిపెట్టారు. 

కాగా, రేవంత్ పై ఈ చట్టాల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

- బ్లాక్ మనీ - ఇన్ కం ట్యాక్స్ చట్టం 2015

- ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002

- ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్ష‌న్స్ యాక్ట్‌ 1988

- ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988

----రేవంత్ పై ఉన్న అభియోగాలు..

-2014 ఫిబ్రవరి 25 న సింగపూర్ లోని బహుళ అంతస్థుల అమ్మకంలో 20 లక్షల సింగపూర్ డాలర్లు

- 25/02/2014రోజున మురళీ రాఘువరన్ దగ్గరి నుంచి 60 లక్షలు పొందాడ‌ని లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు, ఎన్నికల అఫిడవిట్ లో కానీ ఐటీ రిటర్న్స్ లో వాటి సమాచారం ఇవ్వలేదు

-వివిధ ఖాతాల ద్వారా సింగపూర్ మలేసియాలలో ఆస్తులు కూడబెట్టారు

-యాంటీ కరప్షన్ ఆక్ట్ సెక్షన్ 1988 ఉల్లగించారని అభియోగం

- తన అనుచరులు బినామీలు బంధువుల పేర్లతో షెల్ కంపెనీలు సృష్టించి - కేవలం రేవంత్ రెడ్డి లబ్ధి పొందినట్లు ఆరోపణ

- తన కుటుంబ సభ్యల పేరు మీద వ్యవసాయ భూములు - కమర్షియల్ ప్లాట్లు - బిల్డింగ్ లు తదితర ఆస్థులు రేవంత్ రెడ్డి బినామీల మీద ఉన్నట్లు గుర్తింపు

- కొన్ని భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారం ఐటీ రిటర్న్స్ లో కానీ - ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచని రేవంత్ ఉదాహరణ కి ఉప్పల్ ల్యాండ్ కొనుగోలు

- 2009 నుంచి 2014 వరకు - 2014 నుంచి ఇప్పటి వరకు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సంపాదించిన పలు ఆస్తులు ఆదాయానికి మించినవి గుర్తించారు

- 2009 - 2014 ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చిన ఆస్తల వివరాల ప్రకారం ఐటీ రిటర్న్స్ చెల్లింపులు సరిగా లేనట్లు గుర్తింపు

-రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హావాల రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందినట్లు గుర్తింపు

- వియ్యంకుడు వెంకట్ రెడ్డి( రేవంత్ కూతురు నైమిసా రెడ్డి మామయ్య) పేరుతో నెక్సెస్ ఫీడ్ సంస్థ ను స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో భారీ మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు గుర్తింపు

- నెక్సెస్ ఫీడ్ కంపెనీ నుంచి రేవంత్ రెడ్డి ఖరీదైన ఫోర్సే కారు నం. AP37CQ0999 పొందినట్లు గుర్తింపు

- ఫెమా రెగ్యూలేషన్ ఆక్ట్ - బినామీ లావాదేవీలు - లోన్స్ డైవర్టెడ్ - మనీ ల్యాండరింగ్ ఆక్టివిటీస్ ఉల్లఘించినట్లు గుర్తింపు
Tags:    

Similar News