కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పరిశ్రమలు మూతపడ్డాయి.. వాహనాలు బయటకు రావడం లేదు. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి కాలం.. ఈపాటికే ఎండలు తీవ్ర రూపం దాల్చాలి. కానీ పర్యావరణంలో కాలుష్యం తగ్గడంతో ప్రస్తుతం ఎండల తీవ్రత అంతగా లేదు. ఈ లాక్‌డౌన్‌తో పర్యావరణానికి ఎంతో ప్రయోజనం చేకూరిందో ఈ భారత వాతావరణ విభాగం వారు వెల్లడించారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని రకాల కాలుష్యం తగ్గి పర్యావరణం మెరుగుపడిందని చెబుతున్నారు. మనదేశంలో విధించిన లాక్‌డౌన్ వాయు, ధ్వని కాలుష్యంతో పాటు పలు కాలుష్యాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపు 90 శాతం వరకు క్షీణించిందని ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొంటున్నారు. దీని ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదు కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి వర్షాలు సక్రమంగా కురిసి రైతులకు ప్రయోజనం చేకూరనుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం న్యూఢిల్లీలో ఆ విభాగం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాకాల స్థితిగతులపై అంచనా వేశారు.
లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ (ఎల్ఆర్ఎఫ్) పై వివరాలు సేకరించారు. లాక్‌డౌన్ తో వాతావరణ కాలుష్య శాతం భారీస్థాయిలో పడిపోయిందని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కదలికలు అంచనాలకు మించిన స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. మే 31వ తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
లాక్‌డౌన్‌తో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎప్పుడూ లేని స్థాయిలో క్షీణించడంతో వర్షాకాల సీజన్ కాస్త ముందే రావొచ్చని చర్చించారు. ఎల్‌నినో ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వాతావరణ విభాగం అధికారులు ప్రతి యేటా రెండు సార్లు లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్‌ను ప్రకటిస్తారు. ఈక్రమంలో తొలి ఎల్ఆర్ఎఫ్‌ను వెల్లడించడానికి బుధవారం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ తో వాతావరణంలో కాలుష్య తగ్గిందని, ఆకాశం నిర్మలంగా ఉంటోందని ఫలితంగా- నైరుతి రుతుపవనాల్లో చురుకైన కదలికలు కనిపిస్తాయని భారత వాతావరణ విభావం వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి ఆశించిన మేర వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.