ప్రపంచ జనాభా 800 కోట్లు.. ఎదురయ్యే సవాళ్లివీ

Update: 2022-11-15 14:02 GMT
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుందని కూడా తాజా నివేదిక బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి 2022 జనాభా అంచనాలపై ఒక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం జనాభాను మానవాళికి ఒక చారిత్రక మైలురాయిగా ఐరాస అభివర్ణించింది.

ఐరాస నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత అంచనా ప్రకారం..  దేశ జనాభా 141.2 కోట్లకు చేరుతుంది. 2050 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. మరో 15 ఏళ్లలో ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుంది.  8 దేశాల నుంచే తదుపరి 100 కోట్ల జనాభా పెరుగుతుంది. అయితే ఆ తర్వాత జనాభా పెరుగుదల మందగిస్తుందని తేలింది. దీంతో 208 వరకు కూడా 1000 కోట్లకు చేరుకునే అవకాశం లేదు.

వైద్యం, పోషణ, వ్యక్తిగత శుభ్రత సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అాకాల మరణాలు తగ్గి ఆయుర్ధాయం గణనీయంగా పెరిగింది. సంతానోత్పత్తి తగ్గడం వల్ల ప్రపంచ జనాభా పెరుగుదల తగ్గుతోంది.

ప్రపంచ జనాభాలో సగం జనాభా 7 దేశాల్లోనే ఉండడం విశేషంగా చెప్పొచ్చు.  చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్,నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో అత్యధిక జనాభా ఉంది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా,పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ , టాంజానియా దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

2050 నాటికి చైనా జనాభా 130 కోట్లకు తగ్గుతుంది. ఈ శతాబ్ధం చివరకు 80 కోట్లకు తగ్గుతుంది. జనాభా పెరుగుదల వల్ల పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, విద్య, వైద్య సేవలు వంటికి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News