అమెరికాలో తెలుగు ఫ్యామిలీ ఒకటి అనుమానాస్పద రీతిలో మరణించిన వైనం తెలిసిందే. అయోవా రాష్ట్రంలో మూడు రోజుల క్రితం తుపాకీ కాల్పులతో మరణించినట్లుగా చెబుతున్న కుటుంబానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అనుమానాస్పద రీతిలో మరణించిన నలుగురిది గుంటూరుగా తేలింది.
మృతులనను సుంకర చంద్రశేఖర్ రెడ్డి.. లావణ్యలుగా గుర్తించటం.. మరో ఇద్దరు వారి పిల్లలన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వారిలో చంద్రశేఖర్ రెడ్డిది గుంటూరు కాగా.. లావణ్యది ప్రకాశం జిల్లా చీరాలగా తేలింది. గడిచిన మూడు నెలలుగా చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ పరంగా ఒత్తిడిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో పెద్ద కుమారుడికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. వీరి మరణ సమయంలో చంద్రశేఖర్ రెడ్డి అత్తమామలు.. ఆయన తోడల్లుడు.. వారి పిల్లలు పక్క గదిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరి మరణానికి కారణం ఏమై ఉంటుందా? అన్న విషయంపై ఇప్పటికి స్పష్టత రావటం లేదు. వీరి మరణం తెలుగు వారిలో సంచలనంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. వీరి మరణంపై నెలకొన్న మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకూ ఈ ఘటనకు సంబంధించి అనుమానితులుగా చేర్చలేదన్నారు. ఈ కుటుంబ మరణం స్థానికంగా ఉన్న తెలుగు సమాజానికి షాకింగ్ గా మారింది. మరణించిన వారి శరీరంలో తూటాలు ఉన్నప్పటికీ..కాల్పుల కారణంగానే వారి మరణం చోటు చేసుకుందని చెప్పలేమంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంతకీ ఈ మరణాలు ఎందుకు చోటు చేసుకున్నాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.