పరేడ్ లో లవ్ ప్రపోజర్..ఆర్మీ మ్యాన్ లవ్ స్టోరీ

Update: 2018-09-15 11:34 GMT
ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో తెలియదు.. తమ ప్రేయసికి ప్రేమను వ్యక్తపరిచేందుకు అందరూ పార్కులు - బేకరిలు  - కాలేజీలు - వివిధ శృంగారభరితమైన పర్యాటక ప్రదేశాలను అనువుగా ఎంచుకుంటారు. ఈ ఆర్మీ జవాన్ మాత్రం తన ప్రేయసికి పరేడ్ ను మించిన ప్రేమ ప్రదేశం లేదని భావించాడు. ఏకంగా ఆర్మీ పరేడ్ లోనే లవ్ ప్రపోజ్ చేసి ఆమె ఆశ్చర్యపరిచాడు.. ఇతడి సిన్సియర్ ప్రేమకు ఫిదా అయిన ఆ అమ్మాయి ప్రేమను ఒప్పుకొని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ అరుదైన ప్రేమ ఘటనకు వేదికైంది తమిళనాడులోని చెన్నై ఆర్మీ పరేడ్ మైదానం..

25 ఏళ్ల ఆర్మీ అధికారి చంద్రేశ్ సింగ్ చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేశాడు. రాజ్ పుతానా రైఫిల్స్ లో జవానుగా చేరాడు. ఈ నెల 8న జవాన్లకు బ్యాడ్జీలను పెట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన ప్రేయసిని కూడా ఆహ్వానించాడు. బ్యాడ్జీలు పెట్టగానే అందరూ చూస్తుండగా లవర్ ధారా మెహతా వద్దకు వెళ్లి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ప్రపోజ్ చేశాడు చంద్రేశ్. ఇందుకు ధార కూడా ఒప్పుకోవడంతో  చంద్రేశ్ ఆనందానికి అవధులు లేవు. అందరి ముందే ఇది జరగడం.. ప్రియురాలు సిగ్గుపడుతూ ప్రియుడి ఒళ్లో వాలిపోవడం సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడిది వైరల్ గా మారింది.


Tags:    

Similar News