తెలుగు ఎన్నారై కూచిబొట్ల శ్రీనివాస్ హత్యపై కాన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత దౌత్యవేత్తతో సమావేశంలో భాగంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "భారతీయులు చాలా విలువైన వాళ్లు.. ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు.. వారిపై కాల్పులు జరగడంపై సిగ్గు పడుతున్నాను" అని అన్నారు. భారతీయులకు ఎంతో విలువనిచ్చిన కాన్సస్ లో ఇలాంటి ఘటన జరగడం దారుణమని బ్రౌన్ బ్యాక్ అన్నట్లు కాన్సుల్ జనరల్ అనుపమ్ రే వెల్లడించారు. ఒక్క వ్యక్తి విద్వేష చర్యతో తమపై ఓ అంచనాకు రావద్దని ఆయన అన్నారు.
భారతీయ కాన్సుల్ జనరల్ అనుపమ్ రే అధికార పరిధిలోకి కాన్సస్ రాష్ట్రం వస్తుంది. దీంతో ఆయన ఈ ఘటనపై వివరాలు తెలుసుకోవడానికి గతవారం కాన్సస్ వెళ్లారు. గవర్నర్‌తోపాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జెఫ్ కొలియెర్, భారత సంతతి వ్యక్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత సంతతి వ్యక్తులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కాన్సస్ అధికారులు చెప్పారని రే వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా కాన్సస్ షూటింగ్‌లో భారతీయులను కాపాడటానికి ప్రయత్నించి గాయపడిన ఇయాన్ గ్రిలాట్‌ను కూడా రే కలిశారు. గ్రిలాట్ చాలా ధైర్యవంతుడని, మరో వ్యక్తి కోసం అతను బుల్లెట్‌కు ఎదురు నిలిచాడని రే కొనియాడారు.
ఇదిలా ఉండగా అమెరికాలో మన వాళ్లపై కాల్పుల పర్వం కొనసాగుతోంది. మొన్న తెలుగు యువకుడు కూచిబొట్ల శ్రీనివాస్.. నిన్న హర్నీష్ పటేల్.. తాజాగా ఓ సిక్కు వ్యక్తి.. ఇలా భారతీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. 39 ఏళ్ల దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తిపై ఓ గుర్తు తెలియని అమెరికన్ కాల్పులు జరిపాడు. మీ దేశానికి వెళ్లిపో అంటూ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కెంట్ సిటీలో ఉంటున్న దీప్ రాయ్ ఇంటి బయట తన వాహనాన్ని శుభ్రం చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత అతను షూట్ చేశాడు. తనను స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆ వ్యక్తి డిమాండ్ చేసినట్లు బాధితుడు చెప్పాడు. ఆ తర్వాత ఆ గుర్తు తెలియని వ్యక్తి దీప్ రాయ్ చేతిపై కాల్చాడు.అతడు ఆరు అడుగుల ఎత్తున్న ఓ శ్వేతిజాతి వ్యక్తి అని, మొహానికి ముసుగు ధరించాడని బాధితుడు తెలిపాడు. ఈ కాల్పుల ఘటనలో భారతీయ వ్యక్తి గాయాలతో తప్పించుకున్నాడు. అయినా ఈ కేసును తాము సీరియస్ గా తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఎఫ్ బీఐతో కూడా సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేష హత్యలు, ఘటనలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, తాజా ఘటన ఈ ఆందోళనలకు మరింత ఊతమిచ్చేలా ఉందని పోలీస్ కమాండర్ జేరడ్ కాస్నెర్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/