ప్రపంచ టెక్నాలజీ మొత్తం భారత్ దాసోహమవుతోంది. భారతీయుల ప్రతిభకు దిగ్గజ సంస్థలు దిగివస్తున్నాయి. పట్టం కడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత మల్టీ నేషనల్ కంపెనీలను నడిపిస్తున్నది మన భారతీయులు కావడం విశేషం. భారత సంతతికి చెందిన వాళ్లే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ తోపాటు తాజాగా ట్విట్టర్ కు సీఈవోగా నియామకం కావడం గర్వకారణంగా చెప్పొచ్చు.
ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థకు చెన్నైకి చెందిన సుందర్ పిచ్చాయ్ చాలా ఏళ్లుగా సీఈవోగా కొనసాగుతున్నారు. తెలుగువాడైన సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను నడిపిస్తున్నాడు. ఇక వీరే కాదు.. ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్, పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా ఇలా మరెన్నో ప్రఖ్యాత దిగ్గజ సంస్థలను భారతీయులే నడిపిస్తుండడం విశేషం.
తాజాగా ట్విట్టర్ వ్యవస్థపకుల్లో ఒకడైన జాక్.. సంస్థ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా వివిధ పదవుల్లో ఉన్నాడు. ఇప్పుడు సీఈవోగా దిగిపోతున్నాడు. జాక్ స్థానంలోకి భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈవోగా రావడం విశేషం. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.
ఎప్పుడూ ట్విట్టర్ లో వివాదలు, ఇతర సినీ అంశాలు ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ తో ట్విట్టర్ ఢీ అంటే ఢీ అంది. అమెరికాలో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను వేధించింది. జాక్ మొండివైఖరి వల్లే ట్విట్టర్ కు ఇబ్బందులు వచ్చాయని ఆ బోర్డు భావించి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అందుకే సౌమ్యుడు, కలుపుకుపోయే మనస్తత్వం గల భారతీయ నిపుణుడు పరాగ్ కు పట్టం కట్టినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు జాక్ రాజీనామాతో ట్విట్టర్ లో ఇదే ట్రెండింగ్ గా మారింది. భారతీయుడికి పగ్గాలు రావడంపై దేశంలోని ఐటీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.