సమస్యను తెలుపుతూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు వెంటనే స్పందించి తన పరిధిలో ఉన్నంతవరకు సహాయం చేసి ఉదారతను చాటుకునే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనసు గాయపడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ముస్లింల వీసాల విషయంలో మాత్రమే సహాయం చేస్తారని, అదే హిందువులకు వీసా మంజూరు విషయంలో వేధింపులు ఎదుర్కొంటున్నా పట్టించుకోరని విమర్శిస్తూ హిందూ జాగరణ్ సంఘ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై సుష్మా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీటుగా సమాధానమిచ్చారు.
భారతదేశం నా దేశం. భారతీయులంతా నా వాళ్లు. కులం, మతం, భాష, రాష్ట్రం నాకు సంబంధించినవి కావు’ అని సుష్మా ఘాటు సమాధానం ఆమె సమాధానమిచ్చారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను ఆదుకోవడానికి ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఒక్క ట్వీట్ చేస్తే చాలు వెంటనే స్పందించి తన పరిధిలో ఉన్నంతవరకు సహాయం చేసి ఉదారతను చాటుకుంటారు. ఇలా గతంలో ముస్లింల జంటలనే కాకుండా ఏకంగా పాకిస్తాన్ లో ఉన్న వారికి సైతం నిబంధనలను కొద్దిగా సడలించి మరీ సహకరించిన ప్రత్యేకత సుష్మాస్వరాజ్ సొంతం. పైగా భారతీయ సంస్కృతి - సంప్రదాయాలకు ఆమె గౌరవమిస్తారు. అలాంటి వ్యక్తిపై విమర్శలు సరికాదనే భావన వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/