దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే. ఎన్నో మలుపులు..ఎన్నో విచిత్రాలు...అసలు ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా తెలియదు....ఇంద్రాణికి ఎన్ని పెళ్లిళ్లు...పెళ్లికి ముందు ఆమె ఎవరితో సహజీనవం చేసింది ...వారి మధ్య ఉన్న సంబంధాలు నిజమైనవేనా అన్న ప్రశ్నలు అందరి బుర్రలను తొలిచి వేశాయి. అయితే ఈ రోజు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది.
షీనాను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..హత్య జరిగిన తీరును కూడా ఇంద్రాణి పోలీసులకు పూసగుచ్చి చెప్పినట్టు సమాచారం. తన కుమార్తెను తానే చంపానని ఒప్పుకున్న ఇంద్రాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంద్రాణి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. ప్రధానంగా షీనా హత్యకేసులో ఆర్థిక సంబంధం అంశాలు ఎక్కువగా ఉన్నాయని విచారణలో తేలినట్టు టాక్.
షీనా బోరా 2012 ఏప్రిల్ 24న హత్యకు గురైంది. దాదాపు మూడున్నరేళ్ల పాటు ఈ విషయం గురించి బయటకు పొక్కకుండా ఇంద్రాణి జాగ్రత్తలు తీసుకుంది. చివరకు ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్‌రాయ్ అరెస్టుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు పోలీసులు ఇంద్రాణి, ఆమె భర్త పీటర్, కుమారుడు రాహుల్, ఇంద్రాణి మొదటి భర్త సిద్దార్థ్ తో సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఒక్కొక్క సీక్రెట్ బయటపడుతూ ...ట్విస్ట్‌ల మీద ట్విస్ట్ ల తో స్టోరీ ఆసక్తికరంగా మారింది.
తాజాగా పోలీసులు ఇంద్రాణితో పాటు ఆమె భర్త పీటర్ తో సహా పలువురిని విచారిస్తున్న క్రమంలో కీలక సమాచారం లభ్యమైంది. దీనిని ఆధారంగా చేసుకున్న పోలీసులు ఆమెపై పలు ప్రశ్నలు సంధించడంతో తొలుత పొంతనలేని సమాధానాలు చెప్పినా చివరకు ఆమె తన నేరం అంగీకరించింది. అయితే భర్త ఎదురుగానే పోలీసలు ఆమెను మూడు గంటల పాటు సుధీర్ఘంగా విచారించడంతో వెక్కి వెక్కి ఏడ్చినట్టు తెలుస్తోంది. చివరకు నేరాన్ని అంగీకరించిన అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంద్రాణి, పీటర్, సిద్దార్థ ఇళ్లలో చేసిన సోదాలతో పోలీసులకు మరింత కీలక సమాచారం దొరికినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందా అన్నది ఆసక్తిగా మారింది.