టాలీవుడ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి దారుణంగా మాట్లాడారు. ‘సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నట్టు’ ఆయన అన్నట్టు పలు మీడియాల్లో ప్రసారం అవుతోంది.
అసలు సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా? అని వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఘాటు కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయంలో తప్పేంటని సమర్థించుకున్నారు.
సినిమా వాళ్ల పొట్టలు కొడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని.. ఎక్కడ కొడుతున్నామని నల్లపురెడ్డి ప్రశ్నించారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. అది పేదవాళ్లకు ముఖ్యమా కాదా? ఈరోజు ఉన్న హీరోలంతా కోట్లు సంపాదించుకుంటున్నారు.. వారికేమీ.? బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
అదే ఒక పేదవాడు సినిమా చూద్దామని పోతే రూ.100, 500, 1500 అంటూ బ్లాక్ లో అమ్ముతున్నారు. పెద్ద పెద్ద సినిమాలకు ఇది న్యాయమంటారా? ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఎవరైనా పట్టించుకున్నారా? ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్పితే ఇక్కడొక ఆంధ్రప్రదేశ్ ఉందని మీకు గుర్తుందా? అని నల్లపురెడ్డి ప్రశ్నించారు.
సినిమా టికెట్లు తగ్గించాం.. పేదలు సినిమా చూడాలంటే బ్లాక్ లో 1500 అమ్ముతారు.? అదెందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 ఏళ్లు సీఎంగా చేశావ్.. పేదల కోసం సినిమా టికెట్లు తగ్గించిన సందర్భం ఉందా? వాళ్లకు సపోర్టు చేశావ్.. వాళ్లు బలిసే విధంగా చేశావ్.? ఈరోజు మేం పేదల పక్షాన నిలబడి సినిమా టికెట్ల తగ్గిస్తే నువ్వు మాట్లాడుతావా? చంద్రబాబు అని నిలదీశారు.
సినిమా ఇండస్ట్రీ అంతా నీకు సంబంధించిన వాళ్లు.. నీ కమ్యూనిటికి చెందిన వాల్లు ఉన్నారు కాబట్టి వాళ్లకు నువ్వు సపోర్టు చేసి వాళ్లను బలపరుస్తున్నావని నల్లపురెడ్డి కామెంట్ చేశారు.
Full View