గత కొద్దిరోజులుగా కామ్ గా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సూదిగాడి కలకలం మళ్లీ మొదలైంది. శనివారం హైదరాబాద్ లోని వనస్థలి పురంలో సూదిగాడి జాడలు హడలు పుట్టిస్తున్నాయి. రెండు.. మూడు నెలల క్రితం ఏపీలో మొదలైన ఈ సూదిగాడు.. ఒంటరిగా వెళ్లే మహిళలు.. పిల్లల్ని సిరంజితో పొడవటం.. తప్పించుకుపోవటం లాంటివి చేసేశాడు.
ఒక్కోసారి ఈ సూదిగాడి వ్యవహారం వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకునేవి. దీంతో.. ఈ సూదిగాళ్లు ఎవరు? ఎందుకిలా చేస్తున్నారన్న విషయం అర్థంకాక పోలీసులు తల పట్టుకునే పరిస్థితి. సూదిగాడు దాడి చేసిన వారిని పరీక్షించినప్పుడు ఎలాంటి హానికారక ఇంజెక్షన్లు చేస్తున్నట్లుగా గుర్తించలేదు. అయితే.. సూదిగాడి కలకలం సందర్భంగా కొందరు ఏదో కుట్టినా సూదిగాడి పనేనంటూ హడావుడి చేసిన వైనం పలుచోట్ల చోటు చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత హడావుడి సృష్టించినా.. ఈ సూదిగాడు ఎవరన్నది తేల్లేదు. ఒకదశలో ఉధృతంగా సూదిగాడి రచ్చ సాగినా.. ఆ తర్వాత కాస్త కామ్ కావటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం వనస్థలిపురంలోని హిల్ కాలనీలో రమ అనే మహిళకు సూదిని గుచ్చి.. సూదిగాడు పరారయ్యాడు. ఒక్కసారిగా సూదిగాడి కలకలం రేగటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకైనా మంచిది.. రోడ్డు మీద నడిచే సమయంలో కాస్త అటూఇటూ చూసుకుంటూ నడవటం బెటర్.