రావత్ ప్రమాదంపై దర్యాప్తు పూర్తి... బ్లాక్ బాక్స్ లో ఏముందంటే?

Update: 2022-01-03 00:30 GMT
త్రివిధ దళాలకు చీఫ్  బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కేంద్ర హోంశాఖ  ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసినట్లు సమాచారం. కమిటీ సభ్యులు విచారణ జరిపి ఫైనల్ రిపోర్ట్ సమర్పించేందుకు సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రమాదం జరిగి సుమారు రెండు వారాలపైన అయింది. ఈ నేపథ్యంలో  మరికొద్ది రోజుల్లోనే హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను పేర్కొంటూ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలనలో జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా మీరు పరిగణలోకి తీసుకొని వారిని కూడా విచారించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొన్ని కీలకమైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  అయితే వాటిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టి అందుకు సంబంధించిన విషయాలను కేంద్రానికి ఓ నివేదిక రూపంలో ఇవ్వాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్ పై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారంపై ఏమై ఉంటుంది అని దానిని తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నారు.

ఈ కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో విచారణ ముగించిన తరువాత అందుకు సంబంధించిన నివేదికను వైమానిక దళం చీఫ్ కు అందజేయనున్నట్లు తెలుస్తోంది.  అయితే నివేదికకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ ఎటువంటి ప్రకటన చేయడం లేదు. దర్యాప్తు నివేదికను కనీసం ఎవరికీ సమర్పిస్తారు అనే దానిపై కూడా ఇంత వరకు స్పందించ లేదు. అనుకూల వాతావరణం లేకపోవడంమే ప్రమాదానికి ప్రధాన కారణం అని ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తులో తేలినట్లు విశ్వాసనీయ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ కూడా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో 14 మంది అధికారులు కూడా చనిపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా ఉన్నారు.  ఈయన బిపిన్ రావత్ కు వ్యక్తిగత సహాయ సిబ్బంది గా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదం గత నెల డిసెంబర్ లో 8 వ తేదీన జరిగింది. ఈ ప్రమాదానికి గల నిజాలను నిగ్గు తేల్చేందుకు వైమానిక దళంలో పని చేస్తున్న మార్షల్ మానవేందర్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తులో మొత్తం ముగ్గురు పాల్గొన్నారు.
Tags:    

Similar News