అర్జంట్ గా ధర్మానకు సీఎం పోస్ట్ కావాలంట!?

Update: 2022-12-31 08:34 GMT
తాను సీనియర్ మంత్రిని అని ధర్మాన ప్రసాదరావు అంటారు. చిన్న వయసులోనే ఆయనకు మంత్రి పదవి లభించింది. ఆ విధంగా ఆయన ఉత్తరాంధ్రాలో అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన రికార్డుని సాధించారు. అంతే కాదు వైఎస్సార్ తో పాటు జగన్ క్యాబినెట్ లో కూడా పనిచేసిన ఘనతను సాధించారు.

ఆయన చాలా సార్లు అంటూ ఉంటారు. తనకు మంత్రి పదవి మీద మోజు పోయింది అని. తాను రాజకీయాల మీద కూడా పెద్దగా ఆసక్తిగా లేను అని. అయితే ధర్మాన మనసులో ఇపుడు మరో విషయం ఏమైనా ఉందా అన్న చర్చ వస్తోంది. అన్ని శాఖలు చూశారు. రెవిన్యూ మంత్రిగా కీలకమైన బాధ్యతలు చూశారు. మరి మంత్రి పదవి మీద మోజు తీరిపోతే ఉన్నది ఒకటే పోస్ట్. అదే సీఎం పోస్ట్.

ధర్మాన వారికి సీఎం పోస్ట్ మీద వ్యామోహం పెరిగిందా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఎక్కువగా విశాఖ రాజధాని గురించి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రా మీద అదంతా అధికమైన అభిమానం అనుకుంటే ఆయన ఇపుడు ఏకంగా ఉత్తరాంధ్రా రాష్ట్రం అంటున్నారు.

పాలనా వికేంద్రీకరణ అంటూ వైసీపీ మూడు రాజధానుల గురించి గట్టిగా మాట్లాడుతూంటే ధర్మాన వారేమో ఉత్తరాంధ్రా రాష్ట్రం అంటున్నారు. ఉత్తరాంధ్రా రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి పదవి వస్తుంది కదా. పైగా జగన్ రాయలసీమకు చెందిన వారు. ఆయన ఇక్కడ వచ్చి ఏలరు. కదా. సో సీనియర్ మోస్ట్ మంత్రిగా ధర్మానకు చాన్స్ ఉంటుంది అన్న మాట.

అందుకే ఆయన చిన్న రాష్ట్రాలు అంటూ బీజేపీ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా అంటే మూడు జిల్లాలు మరి ఈ మూడు జిల్లాలను రాష్ట్రం చేసుకుంటే జీవిత కాలం కోరిక తీరిపోయి సీఎం కుర్చీ వచ్చి చేతిలో పడుతుంది అని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉంది అనే అంటున్నారు.

ఒక విధంగా ఇది ఉప ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడమే అంటున్నారు. ఒకనాడు మా ప్రాంతం మా అభివృద్ధి అంటూ కేసీయార్ ఇలాగే తెలంగాణా ఉద్యమాన్ని ఎగదోశారు. ఇపుడు మూడు జిల్లాల ఉత్తరాంధ్రా కోసం ధర్మాన ధర్మంగా చెప్పాల్సింది చెబుతున్నారు. మరి ధర్మాన ఈ రోజు కోరిక కాస్తా ఒక విధానంగా నినాదంగా మారితే మాత్రం ఏపీ రాజకీయాలు తారు మారు కావడం తధ్యం. అమరావతి రాజధాని గురించి మా ఉత్తరాంధ్రాలో చంద్రబాబు చెబుతారా అంటూ గర్జించిన ధర్మాన ఉత్తరాంధ్రా రాష్ట్రమే కోరుకున్నారు.

మరి బాబు మీద కోపంతో ఆయన ఆ మాట అన్నా చివరికి అది అటూ ఇటూ తిరిగి జగన్ సీఎం సీటుకే ఎసరు పెట్టేలా ఉంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి చేదు అందుకే ఈ సీనియర్ మోస్ట్ మంత్రి గారు విశాఖ రాజధాని వైపు నుంచి అలా నరుక్కు రావాలని అనుకుంటున్నారా అన్న టాక్ అయితే సాగుతోంది మరి. ఏది ఏమైనా దీని మీద తెలుగుదేశం ఏమంటుందో వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News