ప్రాణం తీసిన ర్యాలీ అవ‌స‌ర‌మా ?

Update: 2022-04-16 13:29 GMT
ఒక్క‌సారి దిగువ ప్ర‌క‌ట‌న చ‌ద‌వండి. కొత్త‌గా బాధ్య‌త‌లు అందుకున్న మంత్రి కోసం ఏర్పాటు చేస్తున్న ర్యాలీకి సంబంధించి వివ‌రం ఇది.ఈ విధంగా ఒక్క తూగోలోనే కాదు ఎక్క‌డ చూసినా  ఇదే వాతావ‌ర‌ణం.త‌మ అభిమాన నేత‌ల రాక కోసం నిరీక్షిస్తూ ఉన్న కార్య‌క‌ర్త‌లు, అటుపై అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.ఆ వివ‌రం తెలుసుకునే ముందు మంత్రి చెల్లుబోయిన ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రామ‌చంద్రాపురం వైసీపీ ఆఫీసు ప్ర‌క‌ట‌న ఎలా ఉందో ఓ సారి చూడండి.

మంత్రి వర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశీస్సుల‌తో మ‌న ప్రియ నేత చెల్లుబోయిన వేణు మ‌రోసారి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాటు అతి కీలకమైన సినిమాటోగ్రఫీ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ బాధ్యతలు అందుకున్నారు.

ఈ నేప‌థ్యంలో తొలిసారి మన రామచంద్రపురం నియోజకవర్గానికి ఏప్రిల్18న విచ్చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి స్వాగ‌తం పలుకుతూ ఉదయం 8 గంటలకు కాకినాడ జిల్లా.గొల్లపాలెం ధనమ్మ గుడి దగ్గర నుంచి కోనసీమ జిల్లా..రామచంద్రపురం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం ఉన్నది.ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.ఇట్లు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..రామచంద్రపుర నియోజకవర్గం  ఇదీ ఆ ప్ర‌క‌ట‌న సారాంశం.

ఇదేవిధంగా అన్ని చోట్లా ఉంది. కొన్ని చోట్ల వ‌లంటీర్లు అతి చేస్తున్నారు. నిన్న‌టి వేళ ధ‌ర్మానకు అభినంద‌న స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌కు రాకుంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలేవీ ద‌క్క‌వ‌ని వ‌లంటీర్లు ఇంటింటికీ తిరిగి చెప్పారు. ఎందుక‌ని? ఇటువంటి వాటిపై కూడా ముఖ్య‌మంత్రి వ‌ర్గాలు ఫోక‌స్ చేయాలి.

మ‌రోవైపు అనంత‌పురంలో ఉష శ్రీ చ‌ర‌ణ్ కు స్వాగ‌తం చెబుతూ తీసిన భారీ ర్యాలీలో చిక్కుకుని చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న చిన్నారి ఆస్ప‌త్రికి చేరుకోలేక చనిపోయింది. మ‌రో చోట మంత్రి జోగి ర‌మేశ్ కు స్వాగ‌తం పలికే సంద‌ర్భంలో ఓ స‌ర్పంచ్ అత్యుత్సాహం కార‌ణంగా గుండె పోటు వ‌చ్చి ప్రాణాలు విడిచారు.

మ‌రో చోట పినిపే విశ్వ‌రూప్ కు సంబంధించి నిర్వ‌హించిన ర్యాలీలు డబ్బులు వెద‌జ‌ల్లారు.ఇవ‌న్నీ ఇప్పుడెందుకు.రెండేళ్ల ప‌ద‌వీ కాలానికి ఇంత అవ‌స‌ర‌మా? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు వెన్నాడుతోంది. చాలా మంది వైసీపీ అభిమానుల‌ను సైతం వేధిస్తోంది.
Tags:    

Similar News