ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ డిగో మారడోనా గత ఏడాది గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు షాక్ కు గురయ్యారు. అప్పట్లో మారడోనా మృతి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిగో మారడోనాకు గుండెనొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన మృతిమీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మారడోనా మృతిపై అర్జెంటీనా ప్రభుత్వానికి ఓ వైద్య నివేదిక అందింది. ఈ నివేదికలో సంచలన విషయాలు ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే మారడోనా మృతిచెందినట్టు సమాచారం. దీంతో అర్జెంటీనా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఒకవేళ డాక్టర్లు ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్టు తేలితే వారిపై మర్డర్ కేసు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఈ ఘటనపై మారడోనా అభిమానులు, ఫుట్బాల్ ఫ్యాన్స్ సైతం షాక్కు గురవుతున్నారు.
ఇంతకాలం మారడోనా గుండెపోటుతో మరణించినట్టు అంతా భావించారు. అయితే ఆయన వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారని తేలడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో మారడోనా ఆస్తులపై కూడా పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆ దిశగాకూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.