వెంకయ్య విషయంలో క్లారిటి వచ్చినట్లేనా ?

Update: 2022-07-07 04:16 GMT
వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విషయంలో నరేంద్రమోడి క్లారిటితోనే ఉన్నట్లున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు పొడిగింపు ఇవ్వకూడదని దాదాపు డిసైడ్ అయినట్టే అనిపిస్తోంది.

ఈ అనుమానం ఎందుకు వస్తోందంటే కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజీనామా చేయటమే కారణం. కేంద్రమంత్రి పదవికి నక్వీ రాజీనామా చేయటం ఒక ఎత్తైతే రాజ్యసభ ఎంపీగా పొడిగింపు ఇవ్వకపోవటం మరో ఎత్తు.

ప్రస్తుతం మోడి మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం ఎంపీ నక్వీ మాత్రమే. అలాంటి నక్వీకి రాజ్యసభ ఎంపీగా పొడిగింపు ఇవ్వలేదు. ఈ కారణంగానే మంత్రిగా కూడా రాజీనామా చేశారు. నక్వీని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయటానికే మోడీ డిసైడ్ అయినట్లు ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఎక్కడా ఈ విషయం అధికారికంగా ప్రకటన జరగనప్పటికీ జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనామానాలు పెరిగిపోతున్నాయి.

మోడీకి అత్యంత నమ్మకస్తుల్లో నక్వీ కూడా ఒకళ్ళన్న విషయం తెలిసిందే. పైగా ఈమధ్య మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా ఇండియాపై నిరసనలు అందరికీ తెలిసిందే.

సో ఈ కోణంలో కూడా మోడీ ఆలోచించి నక్వీని ఉపరాష్ట్రపతిగా ఎంపికచేయబోతున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత వెంకయ్యకు ఎక్స్ టెన్షన్ లేదన్న విషయం దాదాపు తెలిసిపోతోంది.

ఈ నెలాఖరులో ఈ విషయమై క్లారిటి వచ్చిన తర్వాత వెంకయ్య రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిపోయిన తర్వాత వెంకయ్య ఇక విశ్రాంత జీవితం గడపాల్సిందే. తన కూతురు నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్టు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వటం ద్వారా యాక్టివ్ అవ్వాలని వెంకయ్య ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని తొందరలో వెంకయ్యే ధృవీకరించే అవకాశముంది.
Tags:    

Similar News