ఐసిస్-కె లేదా ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్సు ఇది ఇస్లామిక్ స్టేట్ కు అనుబంధ సంస్థ. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లో ఐసిస్-కె క్రియాశీలంగా ఉంది. అఫ్గానిస్తాన్‌లో ఉన్న జిహాదిస్టు గ్రూపులు అన్నింటిలోకెల్లా ఇదే అత్యంత తీవ్రమైన, హింసాత్మకమైనది. ఇరాక్, సిరియాల్లో ఐసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 2015 జనవరిలో ఐసిస్-కె ఏర్పాటైంది. ఆ తర్వాతి కాలంలో అమెరికా నేతృత్వంలోని మిత్రపక్షాలు తమని తాము ఖాలిఫాగా ప్రకటించుకున్న ఐసిస్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్, పాకిస్తానీ జిహాదిస్టులను ఐసిస్-కె తన గ్రూపులో చేర్చుకుంటుంది. ప్రత్యేకించి తమ సొంత సంస్థ ఆలోచనలు అతి తీవ్రంగా లేదా కఠినంగా ఉండటం లేదని భావించే అఫ్గాన్ తాలిబాన్లు ఐసిస్-కె లో చేరతారు.
ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన దారుణాలకు ఐసిస్-కె పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బాలికల పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రసూతి వార్డును కూడా లక్ష్యంగా చేసుకుని గర్భిణులు, నర్సులను కాల్చి చంపింది. తాలిబాన్ కేవలం అఫ్గానిస్తాన్ పై తన దృష్టి సారించగా, ఐసిస్-కె మాత్రం గ్లోబల్ ఐఎస్ నెట్ వర్క్ లో అంతర్భాగం. ఖొరాసన్ ప్రావిన్స్ కేంద్రంగా ఐఎస్ -కె పని చేస్తోంది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్,
తుర్కెమెనిస్తాన్లలో దీని ఉనికి ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని జిహాదీ సంస్థల కన్నా ఇది మరింత డేంజర్. అత్యంత భయానకం, ప్రమాదకారి. ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహూతి దళాలుగా మార్చివేస్తుంది.
పాశ్చాత్య, అంతర్జాతీయ, మానవతా కార్యక్రామాలను లక్ష్యాలుగా చేసుకుని వీలైనప్పుడల్లా దాడులకు పాల్పడుతుంది. తూర్పు ప్రావిన్స్ నంగర్ హార్ స్థావరంగా ఐసిస్-కె ఉంది. మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా జరిగే పాకిస్తాన్ మార్గాలకు సమీపంలో ఉంది.
దీనికి దాదాపు మూడు వేల మంది ఫైటర్లు ఉండేవారు. కానీ, అమెరికా, అఫ్గాన్ బలగాలు, తాలిబాన్ తో జరిగిన పోరాటాల్లో వీరి సంఖ్యాబలం బాగా తగ్గిపోయింది.అధ్యయనకారుల అంచనాల ప్రకారం.. ఐసిస్-కె, హక్కనీ నెట్ వర్క్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. హక్కానీ నెట్ వర్క్ కి తాలిబాన్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాబుల్ లో భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఖలీల్ హక్కాని. 2019 నుంచి 2021 మధ్య జరిగిన ముఖ్యమైన దాడులన్నీ ఐసిస్-కె, తాలిబాన్ హక్కానీ నెట్ వర్క్, పాకిస్తాన్ లోని ఇతర ఉగ్రవాద గ్రూపులతో కలిసి చేసినవే అని గోహెల్ తెలిపారు.
తాలిబాన్‌తో ఐసిస్-కెకు చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జిహాద్ ను, యుద్ధభూమిని వదిలిపెట్టి శాంతి చర్చల పేరిట తాలిబాన్లు ఖతార్‌లోని దోహాలో ఉన్న మిరుమిట్లుగొలిపే హోటళ్ల బాట పట్టారని నిందించేది. భద్రత దృష్ట్యా ఐసిస్ మిలిటెంట్లు త్వరలో ఏర్పాటు కానున్న తాలిబాన్ ప్రభుత్వానికి కూడా ప్రమాదకరంగా మారారు. ప్రస్తుతం అఫ్గనిస్తాన్ లో 1000 మందికి పైగా అమెరికా పౌరులు ఉన్నారు. వారిని స్వదేశానికి తరలించే కార్యక్రమం కంటిన్యూ అవుతుందని అమెరికా అధికారులు చెప్పారు. ఇదిలావుంటే, దాడులు జరిగిన ప్రాంతం ప్రళయాన్ని తలపిస్తోంది. ఘటనా స్థలం చుట్టు పక్కల ఎటు చూసినా క్షతగాత్రులే, రక్తం కారుతున్న ముఖాలు నెత్తురోడుతున్న శరీరంతో జనం పరుగులు పెట్టటం కలచివేస్తోందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ఇక ఐసిస్-కె నెక్స్ట్ టార్గెట్ భారత్ పై దృష్టి పెట్టినట్టు ఇంటిలిజెన్స్ కి సమాచారం అందింది. దేశంలో దాడులు చేయడం , యువతని తమ సంస్థలో కి ఆకర్షించడం , భారత్ లో ఇస్లాం పాలన తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తారట. ప్రస్తుతం భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్ ను యాక్టీవ్ చేసే పనిలో ఉన్నారు ఈ ముష్కరులు.