ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పెచ్చుమీరిన రాక్షసత్వానికి ఇదో పరాకాష్ట. తాజాగా ఇద్దరు టర్కీ సైనికులను సజీవ దహనం చేసిన వీడియోను వాళ్లు విడుదల చేశారు. యూనిఫామ్ వేసుకున్న ఇద్దరు సైనికులను ఓ బోను నుంచి లాక్కొని వచ్చి.. వారిని దహనం చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది. సిరియాలోని అలెప్పోలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఐసిస్ విడుదల చేసిన 19 నిమిషాల నిడివి గల వీడియోలో ఓ వ్యక్తి టర్కిష్ లో మాట్లాడుతూ.. టర్కీలో విధ్వంసం సృష్టిస్తామని అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ను హెచ్చరించాడు. ఈ ఇద్దరు టర్కీ సైనికులను ఐఎస్ జిహాదీలు గత నెలలో కిడ్నాప్ చేసినట్లు వాళ్ల న్యూస్ ఏజెన్సీ అమక్ వెల్లడించింది. అంకారాలో 16 మంది టర్కీ సైనికులను హతమార్చిన మరుసటి రోజే ఐఎస్ ఈ వీడియో రిలీజ్ చేయడం గమనార్హం. ఆగస్ట్ 24న టర్కీ సేనలు సిరియాలో అడుగుపెట్టాయి. టర్కీ అనుకూల సిరియా రెబల్స్ కు మద్దతుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను - కుర్దిష్ సైన్యాన్ని అక్కడి నుంచి పారదోలడమే లక్ష్యంగా టర్కీ సైన్యం సిరియాలో అడుగుపెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటివరకు 38 మంది టర్కీ సైనికులు మృత్యువాత పడ్డారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/