ఈ యాప్ ఉంటే పాన్ కార్డు వ‌చ్చేస్తుంది

Update: 2017-02-16 10:32 GMT
న‌గ‌దు ర‌హిత లావాదేవీలు పెరిగిపోతున్న‌ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో  పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) త‌ప్ప‌నిస‌రి అయిన సంగ‌తి తెలిసిందే. అయితే పాన్ కార్డు కోసం ఇకపై వారాలు - నెలలపాటు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. కొన్ని నిమిషాల్లోనే పాన్ నంబర్‌ ను జారీ చేస్తారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మత్రిత్వ శాఖ ప్రత్యేక యాప్‌ ను రూపొందిస్తోంది. దీంతో సెల్‌ ఫోన్ ద్వారా పాన్ నంబర్‌ను పొందవచ్చు. దీని ద్వారా ఇన్‌ కం ట్యాక్స్‌ ను చెల్లించవచ్చు. ట్యాక్స్ వివరాలను తెలుసుకోవచ్చు. ఆధార్ ఈ కేవైసీ ద్వారా నిమిషాల్లో పాన్‌ కార్డు నంబర్‌ ను జారీ చేయాలని ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం ఈ యాప్‌ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా పాన్ నంబర్‌ కు దరఖాస్తు చేసుకున్నవారి చిరునామా, పుట్టిన తేదీని బయోమెట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని, తద్వారా నిమిషాల్లో పాన్ నంబర్‌ను జారీ చేయవచ్చని అధికారులు వివ‌రిస్తున్నారు. పాన్ కార్డు కోసం ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, త్వరలో తీసుకురానున్న నూతన విధానంతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఆధార్ కార్డు ద్వారా ప్రజలు ఇప్పటికే సిమ్‌ కార్డులు - బ్యాంకు ఖాతాలు - సబ్సిడీలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలో కొత్త విధానం ద్వారా స‌మ‌స్య‌లు కూడా ఏమీ ఎదుర‌వ్వ‌వ‌ని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News