గురువారం ఉదయం కన్నడ చిత్ర పరిశ్రమకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. శాండల్ వుడ్ లో బడా స్టార్లు నిర్మాతల గృహాలు ఆఫీసుల పై భారీగా దాడులు జరిగాయి. శివరాజ్ కుమార్..అయన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. యష్.. కిచ్చ సుదీప్.. నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్.. సిఆర్ మనోహర్.. విజయ్ కిరంగాదూర్.. డిస్ట్రిబ్యూటర్ జయన్న నివాసాలతో పాటుగా వారి బంధువుల నివాసాలపై కూడా ఈ దాడులు జరిగాయని సమచారం. ఈ దాడులు గురువారం అర్థరాత్రివరకూ కొనసాగాయట. దాడుల సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందట
ఈ దాడులలో షుమారుగా 200 మంది ఐటీ అధికారులు పాలుపంచుకున్నారని... వీరందరూ 15 రోజుల క్రితమే ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని.. అంతా రెడీ అయ్యాక మెరుపు దాడులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారని సమాచారం. ఈ ఐటీ అధికారులు బెంగళూరు..చెన్నై.. హైదరాబాద్.. అమరావతి ప్రాంతాల నుండి వచ్చారట. వీరందరూ 25 బృందాలుగా విడిపోయి దాడులు చేపట్టారట. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం ఈమధ్య కన్నడ పరిశ్రమలో ఊపందుకుంది. దీంతో పన్ను ఎగవేత అనుమాల కారణంగానే ఐటీ ఈ స్థాయిలో భారీగా దాడులకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఐటీ అధికారులు శివరాజ్ కుమార్.. పునీత్ రాజ్ కుమార్ కు చెందిన నివాసాలపై దాడులు చేసి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారట. కేజీఎఫ్ ఫేమ్ యష్ కు చెందిన రెండు నివాసాలపై దాడులు చేశారు. ఆయన సోదరి ఇంట్లో..మామగారి ఇంట్లో కూడా కూడా సోదాలు నిర్వహించారట. ఈ సోదాల విషయం తెలుసుకున్న యష్ ముంబై నుండి బెంగళూరు కు వచ్చాడు. ఇక మరో కన్నడ స్టార్ సుదీప్ కూడా ఐటీ దాడుల విషయం తెలుసుకున్న వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని మరీ మైసూరు నుండి బెంగళూరు వచ్చాడట. పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్.. యష్.. సుదీప్..అందరి ఇళ్ళలో భారీగా బంగారు నగలు.. వజ్రాభరణాలు దొరికాయట. ఇదిలా ఉంటే ఐటీ అధికారులు ఇంకా దాడుల గురించి మీడియాకు ఎటువంటి వివరాలు అందించలేదు.
Full View