తెలంగాణలో ఉద్యమాల వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీ మరోమారు వేడెక్కుతోంది. ఉద్యమకారులు - రాజకీయ పార్టీ విమర్శలు - సభల నిర్వహణతో మళ్లీ ఓయూ వార్తల్లో నిలుస్తోంది. అన్నింటికీ మించి ఓయూలో రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కీలక పరిణామాలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే జూన్ ఒకటిన విద్యార్థి జేఏసీ 'కేసీఆర్ పాలన -విముక్తి' అనే పేరుతో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది. ఈ సభను అన్ని ప్రతిపక్షాలు - ప్రజాసంఘాల సమక్షంలో నిర్వహించనున్నారు.
తెలంగాణ ఉద్యమ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ ఎస్ పార్టీలో అనేక మంది ద్రోహులు చేరారని వారు గుర్తు చేస్తున్నారు. ఒకపుడు టీఆర్ ఎస్ లో కీలక పాత్ర పోషించిన పలువురు నేతలు జేఏసీ నేతలు ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలోను ప్రముఖ పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నారు. వారిలో టీఆర్ ఎస్ లో గతంలో పనిచేసిన చెరుకు సుధాకర్ - జిట్టా బాలక్రిష్ణారెడ్డి - యెన్నం శ్రీనివాసరెడ్డి - ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు రాజారాం యాదవ్ - బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తదితరులు ప్రస్తుతం తెరవెనుక మంత్రాంగాన్ని నడుపుతున్నారు. జూన్ రెండున ఓయూలో జరిగే బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమకారులంతా సమావేశం కావాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ సభ తరువాత జేఏసీకి సంబం దించిన జెండాను ఎజెండాను ఖరారు చేస్తామని నేతలు పేర్కొంటున్నారు.