ఉద్యోగులు అంటే ప్రభుత్వ రధానికి చక్రాలు లాంటి వారు. అలాంటి ఉద్యోగులు కనుక అలిగినా కోపించినా సర్కార్ బండి ముందుకు కదలదు. కొన్ని నెలల క్రితం ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు రెడీ అయ్యారు. దాంతో ఏమి జరుగుతుందో అని అంతా భావించారు. కానీ వారికి నచ్చచెప్పి వారికి కొన్ని హామీలు ఇచ్చి మరీ వైసీపీ ప్రభుత్వం దారికి తెచ్చుకుంది.
అయితే ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని ఉద్యోగులు ఉరుముతున్నారు. తమకు ఉద్యమం చేయడం తప్ప గత్యంతరం లేదని కూడా వారు అంటున్నారు. తమ పరిస్థితి ఎందాక వచ్చిందంటే కనీసం ప్రతీ నెలా ఒకటవ తారీఖున జీతాలు ఇవ్వండి మహా ప్రభో అని వేడుకోవాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.
ఈ మేరకు అమరావతిలో ఉద్యోగుల జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి మరీ జగన్ సర్కార్ మీద మండిపడ్డారు. ఒకటవ తారీఖు దేముడెరుగు మొదటి వారంలోగా కూడా జీతాలు అందడంలేదు అని వారు అంటున్నారు. ఇక పెన్షనర్ల సంగతి మరీ దారుణం. వారికి ప్రతీ నెలా ఇరవై అయిదవ తారీఖున కూడా పెన్షన్ అందడంలేదని వారు వాపోతున్నారు.
అదే విధంగా తమకు కరవు భత్యం విషయంలో ప్రభుత్వం హ్యాండ్ ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం మా ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులను కూడా ఇతర ప్రయోజనాల కోసం మళ్లించిందని, మళ్లీ వాటిని తిరిగి ఇవ్వడం లేదని ఉద్యోగులు పేర్కొన్నారు. అదే విధంగా చూస్తే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన కరవు భత్యం బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వారు ఫైర్ అవుతున్నారు.
వీటి మీద తాము అడిగితే అధికారులు సాంకేతిక లోపం వల్ల జరిగిందని చెప్పార,సరేనని అనుకున్నామని, కానీ ఇప్పటికి వాటిని తిరిగి ఇవ్వడం లేదఅంటే ఏమనుకోవాలని వారు మండిపోతున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చెసినట్లుగా గొప్పగా ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు కానీ ఆర్టీసీ ఉద్యోగులకు సవరించిన వేతనాలు చెల్లించడం లేదని కూడా వారు పేర్కొన్నారు.
ఇక మాకు ప్రభుత్వం మీద పోరాటాలు చేయడం కంటే వేరే మార్గం లేదు అని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ఈ మేరకు అమరావతిలో సమావేశమైన ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు తదితరులు మాట్లాడుతూ ఇలాగైతే ఇక సమరమే అని చెబుతున్నారు.
ఉద్యోగులు జగన్ సర్కార్ మీద గుర్రు మీద ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సరైన టైమ్ చూసి మళ్లీ ప్రభుత్వం మీద పోరటం చేసేలాగే ఉన్నారు. మరి జగన్ సర్కార్ ఉద్యోగుల కోపాన్ని ఎలా అర్ధం చేసుకుంటుందో. ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.