ఒక్క నిర్ణయంతో సమాజంలో ఎంత మార్పు తేవొచ్చన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అమ్మ ఒడి పథకం. పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించటమే లక్ష్యంగా ఇప్పటికే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.అయితే.. అందుకు భిన్నంగా.. ఇప్పటివరకూ మరే సీఎం స్టార్ట్ చేయని రీతిలో ప్రకటించిన అమ్మ ఒడి ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏపీ స్కూళ్ల రూపురేఖల్ని మార్చటమేకాదు.. బడికి తమ పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు పోటెత్తుతున్న పరిస్థితి. ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ.. స్కూలు ఏదైనా తమ పిల్లాడ్ని బడికి పంపు తల్లిదండ్రుల అకౌంట్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున జమ చేసే వినూత్న కార్యక్రమాన్ని జగన్ తెర తీయటంతో ఈసారి స్కూల్ ఆడ్మిషన్లలో కొత్త సీన్ కనిపిస్తోంది. ఇప్టపివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని ప్రభుత్వ.. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు చేరేందుకు పోటెత్తుతున్నట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పాటు.. మోడల్ స్కూళ్లు.. మున్సిపల్.. జెడ్పీ.. ఎంపీపీ స్కూళ్లలో ఆడ్మిషన్లు భారీగా పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం 1,51,719 కొత్త ఆడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరంలో నమోదయ్యాయని.. వీరిలో 42,893 మంది ఇంగ్లిషు మీడియం స్కూళ్లలో చేరినట్లుగా తెలుస్తోంది. 30,327 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో ఆడ్మిషన్లు తీసుకున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల్ని చేర్పించేందుకు ప్రతి ఏటా బడిబాట పేరుతో అధికారులు ఒక పథకాన్ని అమలు చేస్తుంటారు. అయితే.. దీనికి అంత ఆదరణ లేదు. అందుకు భిన్నంగా అమ్మ ఒడి కార్యక్రమానికి విపరీతమైన స్పందన రావటమే కాదు.. స్కూల్ విద్యార్థులతో ఏపీ బడులు కళకళలాడుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి మండలం పరిధిలోని స్కూళ్లలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో విద్యార్థుల ఆడ్మిషన్లు ఎక్కువై పాఠశాలలు కళకళలాడుతున్నట్లుగా చెబుతున్నారు. నవరత్నాల్లోని మొదటి పథకంతో జగన్ మార్క్ మార్పు మొదలైందని చెప్పక తప్పదు.