జగన్ పవన్ ఒకే ఫ్రెమ్ లో...ఎక్కడ...ఎపుడు....?

Update: 2022-11-11 04:56 GMT
ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఎన్నడూ చూడని ఒక అరుదైన సన్నివేశం కొద్ది గంటలలో జరగబోతోంది అని అంటున్నారు. అదేంటి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించనున్నారు అన్నది. దానికి విశాఖ ఏయూ ఇంజనీరింగ్ ప్రాంగణం సాక్షిగా నిలుస్తుంది అని అంటున్నారు. విశాఖలో రెండు రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  టూర్ ఉంది.

అలాగే సీఎం జగన్ కూడా విశాఖలో రెండు రోజుల పాటు గడపబోతున్నారు. ఇప్పటిదాకా అనుకున్నది ప్రధాని ముఖ్యమంత్రి ఏయూలో సభా వేదిక మీద కనిపిస్తారు అని. కానీ సడెన్ గా మారిన పిక్చర్ చూస్తే మధ్యలోని పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు. పవన్ కళ్యాణ్ 11న సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి విశాఖ చేరుకుంటారు.

ఆయన అదే రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో నేవీ వారి చోళా అతిధి గృహంలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు అన్నది కచ్చితమైన సమాచారం. ఈ భేటీ తరువాత 12న విశాఖలో జరిగే బహిరంగ సభలో కూడా పవన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రధాని మోడీతో కలసి ఆయన ఎన్డీయే  మిత్ర పక్షంగా ఈ సభకు హాజరవుతారు అని చెబుతున్నారు. అదే కనుక జరిగితే మాత్రం వేదిక మీద జగన్ పవన్ తొలిసారి కలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా పవన్ జగన్ ఎక్కడా కనీసం ముఖాముఖీ కూడా కలుసుకున్న సందర్భాలు లేవు. ఇద్దరూ రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్నా ఎదురుబొదురు పడిన సంఘటనలు అసలు లేవు.

దాంతో విశాఖ సాగర తీరాన జగన్ పవన్ ఎదురుపడితే పక్క పక్కన కూర్చుంటే ఆ సన్నివేశమే అత్యంత అరుదైనదిగా అంతా భావించడం ఖాయం. ఆ రేర్ పిక్  సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో కూడా చెప్పడానికి వీలు లేదు.

ఇక పవన్ టూర్ ప్రొగ్రాం చూస్తే ఆయన ఈ రోజు సాయంత్రానికి విశాఖ చేరుకొని ఈ నెల 13 సాయంత్రం దాకా విశాఖలోనే ఉండబోతున్నారు. అంటే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిపోయినా కూడా పవన్ మాత్రం మరో రోజు అదనంగా విశాఖలో ఉంటారు. ఆయన జనసేన పార్టీ సమావేశాలను నిర్వహిస్తారని, నాయకులతో పార్టీ విషయాలు చర్చిస్టారని అంటున్నారు.

అదే విధంగా చూస్తే గత నెల 15న పవన్ విశాఖ వచ్చి రెండు రోజుల పాటు కేవలం హొటల్ గదిలే పరిమితం అయ్యారు. అది జరిగిన తరువాత తొలిసారి విశాఖ వస్తున్న పవన్ ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది. మొత్తానికి చూస్తే పవన్ విశాఖ టూర్ మీదనే ఇపుడు అందరి కళ్ళూ ఉన్నాయన్నది వాస్తవం. మరి పవన్ జగన్ మధ్యలో మోడీ ఈ పిక్చర్  ఉంటుందా. ఏపీ జనాలు ఈ అరుదైన దృశ్యాన్ని  దాన్ని చూస్తారా అంటే ఈ డౌట్ తీరేందుకు కొద్ది గంటలు ఆగాల్సిందే మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News