కిమ్‌కు అన్న‌గా జ‌గ‌న్‌.. చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-08-26 09:30 GMT
త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. ఏపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విరు చుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని న‌ట్టేట ముంచారంటూ.. ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. వినాయ‌క చ‌వితి పందిళ్లకు రిజిస్ట్రేష‌న్ చార్జీలు వ‌సూలు చేస్తున్న దౌర్భాగ్య ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అని విరుచుకుప డ్డారు.

రేపు ముస్లింలు మ‌సీదుకు వెళ్లాలంటే కూడా ప‌న్నులు వేస్తార‌ని.. న‌మాజు చేసుకునేందుకు కూడా ప‌న్నులు వ‌సూలు చేస్తార‌ని.. మండిప‌డ్డారు. ఇవ‌న్నీ క‌ట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అంతేకాదు..''న‌వ్వితే.. కొట్టేవాడు. ఏడుస్తుంటే.. న‌వ్వాల‌ని కొట్టేవాడు.. ఒక‌డున్నాడు. ఆయ‌నే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌. ఇప్పుడు ఇక్క‌డ మ‌నకు కిమ్ అన్న‌య్య జ‌గ‌న్ ఉన్నాడు. లేస్తే.. ప‌న్ను. కూర్చుంటే ప‌న్ను వేస్తూ.. ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తున్నాడు'' అని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

చెత్త‌పై ప‌న్ను వేస్తున్న చెత్త ముఖ్య‌మంత్రి ఈ దేశంలో ఒక్క జ‌గ‌నేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఓ ఇంటి పెద్ద మ‌నిషి చెత్త‌ప‌న్ను క‌ట్ట‌లేద‌ని.. ఆ ఇంటి ముందు ఊళ్లో ఉన్న చెత్తంతా తెచ్చి పోశార‌ని.. ఇదే అన్యాయ‌మ‌ని.. ప్ర‌శ్నిస్తే.. కేసులు పెట్టార‌ని దుయ్య‌బట్టారు.

అన్యాయం జ‌రిగిన వారికి టీడీపీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. త‌న హ‌యాంలో అమ‌లైన దుల్హ‌న్‌, రంజాన్ తోఫా.. విదేశీ విద్య‌, పెళ్లికానుక‌.. వంటివి అన్నింటినీ..జ‌గ‌న్ నాశ‌నం చేశాడ‌ని.. ప్ర‌జ‌ల‌కు క‌నీసం గౌర‌వంగా త‌లెత్తుకుని బ‌తికేలా కూడా ఆయ‌న పాల‌న లేద‌ని దుయ్య‌బట్టారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌నునిలిపివేస్తారంటూ.. విష ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ.. తాము అధికారంలోకి వ‌స్తే.. అన్ని ప‌థ‌కాలను మ‌రింత మందికి అందించేలా.. చూస్తామ‌ని.. ఇంత‌క‌న్నా మంచి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

కాగా, నేటితో చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. మొత్తం మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కుప్పం వ‌చ్చిన చంద్ర‌బాబుకు తొలి రెండు రోజులు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యారు. తొలిరోజు.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబు కాన్వాయ్ ల‌క్ష్యంగా రాళ్ల‌దాడి చేశారు. రెండోరోజు ఆయ‌న ప్రారంభించాల్సిన అన్న‌క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య మూడోరోజు.. కేంద్ర ప్ర‌భుత్వం చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌ను రెట్టింపు చేసింది.
Tags:    

Similar News