జగన్ ఎఫెక్ట్..ఏపీలో అవినీతి భారీగా తగ్గింది

Update: 2019-11-30 14:24 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో ఎన్నడూ లేనంత స్థాయిలో అవినీతి చోటుచేసుకుందంటూ విపక్ష టీడీపీ - ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడు నారా లోకేశ్ చేసిన ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది. జగన్ పాలనలో ఏపీలో అవినీతి భారీ స్థాయిలో తగ్గిపోయిందని జాతీయ స్థాయి సర్వేలో తేలింది. అంతేకాకుండా చంద్రబాబు జమానా లోనే ఏపీలో తీవ్ర స్థాయిలో అవినీతి సాగిందని కూడా రుజువైపోయింది. మొత్తంగా అవినీతి నిర్మూలనలో జగన్ మంచి మార్కులే వేయించుకున్నారన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.

సరే మరి జగన్ జమానాలో అవినీతికి అడ్డుకట్ట పడుతోందని చెప్పిన సదరు సర్వే వివరాల్లోకి వెళితే... ఇండియా కరప్షన్ 2019 పేరిట జాతీయ స్థాయిలో ఓ సర్వే జరిగింది. 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ మధ్య ఎంత మేరకు రాష్ట్రాల్లో కరప్షన్ జరిగిందనే దానిపై.. 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది ప్రజలను అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే చేశారట. ఈ సర్వేలో ఏపీ 13 వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాది జరిగిన ఈ తరహా సర్వేలోనే ఏపీ ఐదో స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు జగన్ సీఎంగా పదవి చేపట్టాక... అవినీతిలో ఏపీ ఐదో స్థానం నుంచి 13 వ స్థానానికి పడిపోయింది. అంటే... ఏపీలో జగన్ సీఎం అయ్యాక భారీ ఎత్తున అవినీతి తగ్గిందన్న మాట.

ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ అవినీతిలో ఐదో స్థానంలో ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. అంతేకాక రాష్ట్రంలో వందకు 67% మంది ప్రజలు తమ పనులకు లంచం ఇస్తున్నట్లుగా తేలింది. తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. జగన్ మోహన్ రెడ్డి.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత.. అవినీతి స్థాయి ఒక్కసారిగా సగానికి సగం మేర తగ్గిందని తెలుస్తోంది. అటు దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా రాజస్థాన్ మొదటి ప్లేస్‌లో నిలిస్తే.. బీహార్ - జార్ఖండ్ - ఉత్తరప్రదేశ్‌ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. అక్కడ 10 శాతం మాత్రమే ఉంది. గోవా (20) - ఒడిశా (40) - ఢిల్లీ (46) శాతం అవినీతి నమోదైంది.


Tags:    

Similar News