ఆనం రాంనారాయరెడ్డి నిన్నటి నిన్న నెల్లూరు జిల్లాలో మాఫియాల రాజ్యం నడుస్తోందంటూ సొంత వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడి కలకలం రేపారు. ఈయనపై సీఎం జగన్ ఆగ్రహించి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఏపీ అసెంబ్లీలో మాత్రం ఆనం రాంనారాయణ రెడ్డి ప్రతిపక్ష చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఆనం వ్యాఖ్యలకు సీఎం జగన్ పడిపడి నవ్వుకున్నారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం కనిపించింది.
అసెంబ్లీలో మైక్ నందుకున్న ఆనం రాంనారాయరెడ్డి మాట్లాడుతూ ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కనే నా సీటు ఉందని..ఆయన తరచూ le పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడని.. ఆయన పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకు ఉందా సార్.. నేను చాలా చిన్నవాణ్ణి.. దయచేసి ఆయన పక్కనుంటే నేను మాట్లాడలేను.. భయం వేస్తోంది. నా సీటును వెంటనే చంద్రబాబుకు దూరంగా మార్చండి’ అంటూ స్పీకర్ ను వేడుకున్నారు..
దీంతో సీఎం జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆనం కామెడీ వ్యాఖ్యలకు పడీ పడీ నవ్వుకున్నారు. సీఎం జగన్ నవ్వులు చూశాక వైసీపీ అధిష్టానం ఆనం రాంనారాయణ రెడ్డిని క్షమించిందని.. ఆయన చర్యలు తీసుకోదని భావిస్తున్నారు.