ఏపీలో ఆ పనిచేసే వారికి ఇక కష్టమే ..సీఎం ఏంచేసాడంటే ?

Update: 2019-11-22 06:50 GMT
ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని వైసిపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం  పారదర్శక పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ఎలాంటి అవినీతికి తావులేకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తున్నారూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ఎన్నికల సమయంలో  ఏపీని అవినీతి రహితా రాష్ట్రంగా మారుస్తాం అని హామీ  ఇచ్చారు ... అందులో భాగంగానే అవినీతిపై యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది.  

ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని నిర్మూలించేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఫిబ్రవరి మూడోవారం నాటికి ఈ సంస్థ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ విశ్వజిత్‌ సంతకాలు చేశారు. అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా పేదలు, సామాన్యులకు మేలు జరుగుతుందని , ప్రభుత్వ పథకాలన్నీ వివక్ష, అవినీతికి తావులేకుండా పారదర్శక విధానంలో అందరికీ అందుతాయని సీఎం జగన్ తెలిపారు.  ఇకపై రాష్ట్రంలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే ..కఠిన చర్యలు తప్పవని సీఎం తెలిపారు.
Tags:    

Similar News