ప్రస్తుతం ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. డిసెంబరు 1న తొలిదశ, అదే నెల 5న మలి దశ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 27 సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో ఇప్పుడు ఏపీ సీఎం జగన్.. గుజరాత్‌పై దృష్టి పెట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఏం జరుగుతోంది. ఇన్నేళ్లుగా అధికారం కాపాడుకునేందుకు ఏంచేస్తున్నారు? ఇప్పుడు మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా తట్టుకుంటున్నారు? వంటి కీలక అంశాలపై ఆయన సమాచారం తెప్పించుకుంటున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు గుజరాత్‌లో ఏం జరుగుతోందనేది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణ, హిందుత్వ నినాదం.. ఈ రెండింటి ఆధారంగా ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించాలని గుజరాత్‌లో బీజేపీ భావిస్తోంది. అధికారంలో ఉండే పార్టీపై వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకతను వీటిద్వారా అధిగమించాలని కమలనాథులు సమాయత్తమవుతున్నారు. తొలి జాబితాలో 160 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది. 111 మంది సిట్టింగు ఎమ్మెల్యేల్లో 69 మందికే మరోసారి అవకాశం కల్పించింది. కీలక నగరం అహ్మదాబాద్(మన దగ్గర విశాఖ తరహా)లోనైతే 12 మందిలో 10 మందిని మార్చేసింది.
అయితే, బయటకు కనపడని రీతిలో ప్రభుత్వ వ్యతిరేకత కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. హిందుత్వ, రామ మందిరం వంటి అంశాలవైపు మొగ్గాలా, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల ఆధారంగా ఎన్నికల్లో స్పందించాలా అనే మీమాంస సగటు ఓటర్లలో ఉంది. దీంతో అలాంటివారి మనసును మార్చడంలో ఏ ఒక్క ప్రయత్నాన్ని వదులుకోరాదని బీజేపీ నేతలు తపన పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, సామాజిక సమీకరణాల సంతులనంలో భాగంగానే 2021 సెప్టెంబరులో విజయ్ రూపాణీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ను తీసుకువచ్చారు.
గుజరాత్ 1995 నుంచి ఇంతవరకు కమలానికి కంచుకోటగానే ఉంది. మధ్యలో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన విధించినా, మిగిలిన కాలమంతా బీజేపీ సీఎంలే రాష్ట్రాన్ని పాలించారు. అందువల్ల ప్రజలకు మొహం మొత్తేసిందా అనే అనుమానాలైతే లేకపోలేదు. అయితే ``మోడీత్వ' అంశం కారణంగా బీజేపీ పరిస్థితి సురక్షితంగానే ఉందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది.
అహ్మదాబాద్ నగరంలో ముఖ్యమంత్రికి, మరో ఎమ్మెల్యేకి మినహా పాతవారికి టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్ఠానం.. రాష్ట్రం మొత్తం మీద 62 మంది కొత్తవారికి స్థానం కల్పించింది. టికెట్లు పొందలేనివారిలో అనేకమంది మంత్రులు ఉన్నారు. మార్చి నుంచే చేపట్టిన క్షేత్రస్థాయి సమాచార సేకరణ, స్వతంత్ర సర్వేలు ఆధారంగా టికెట్ల కేటాయింపును పూర్తిచేస్తున్నారు.
కట్ చేస్తే.. ఏపీలోనూ ఈ విధానం అనుసరించే అవకాశం లేకపోలేదని వైసీపీ సీనియర్లు తమ సంభాషణల్లో పేర్కొంటున్నారు. సీఎం జగన్ బొమ్మకు తోడు సంక్షేమం, మూడు రాజధానుల విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి.. ప్రభుత్వ వ్యతిరకతను తగ్గించేలా వ్యూహాత్మకంగా వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.