ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సాగుతోంది. గడిచిన 53 రోజులుగా సాగుతున్న పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. బాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బాబుకు అసలు ఎందుకు ఓటు వేయాలంటూ ఆయన సంధిస్తున్న క్వశ్చన్లకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పోటెత్తిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్న జగన్ ఏం ప్రశ్నలు వేస్తున్నారన్నది చూస్తే.. బాబు మూడున్నరేళ్ల పాలనపై సునిశిత విమర్శల్ని సంధిస్తున్నారు.
జగన్ సంధిస్తున్న ప్రశ్నలకు ఏపీ అధికారపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు తెర లేస్తున్న వేళ.. ప్రజలపై హటాత్తుగా ప్రజలపై ప్రేమ పొంగుకు వస్తుందన్నారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు డ్రామాలాడుతున్న చంద్రబాబు తీరును ప్రస్తావిస్తూ.. నాలుగేళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో ఇంకా చాలామందికి పింఛన్లు ఇవ్వలేదన్న విషయం బాబుకు అర్థమైందన్నట్లుగా త్వరలో మళ్లీ కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ప్రజల్ని మభ్య పెట్టేందుకు పింఛన్ల పేరుతో కొత్త నాటకానికి బాబు తెర తీస్తున్నారన్నారు.
అసలు బాబుకు ఎందుకు ఓటు వేయాలన్న ప్రశ్నను సంధించిన జగన్.. బాబు తీరును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. తీరా పవర్లోకి వచ్చాక విద్యుత్ బిల్లులు పెంచినందుకు ఓటు వేయాలా? అని ప్రశ్నించిన జగన్.. మూడున్నరేళ్ల పాలనలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు ఓటు వేయాలా? అని క్వశ్చన్ చేశారు.
"ఇవాళ రేషన్ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వ నందుకా? పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని, ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ఇవ్వనందుకా? బ్యాంకుల్లో పెట్టిన రైతుల బంగారం వారి ఇంటికి రానందుకా? అన్నదాతల రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ కానందుకా? అప్పు చెల్లించాలని బ్యాంకులు రైతుల ఇళ్లకు నోటీసులు వస్తున్నందుకా? మీరిస్తున్న సొమ్ము అప్పులకు అయిన వడ్డీకి కూడా సరిపోనందుకా? పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కానందుకా? వీరికెవ్వరికీ బ్యాంకులు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వనందుకా? ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట నిలుపుకోనందుకా? ఈ నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో ఇంటింటికీ రూ.90 వేలు బాకీ పడినందుకా? ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడటానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకా? మట్టి.. ఇసుక.. మద్యం.. బొగ్గు మొదలు రాజధాని భూములు - గుడి భూములనూ వదలకుండా అవినీతికి పాల్పడుతున్నందుకా? జన్మభూమి కమిటీలను మాఫియాగా మార్చి ప్రజలను పీడిస్తున్నందుకా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికల వేళ.. బాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదన్న విషయాన్ని తన ప్రశ్నలతో సంధించిన జగన్ మాటలకు సభకు హాజరైన జనం పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం గమనార్హం. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ జగన్ చేసిన ప్రసంగానికి జనం నుంచి వచ్చిన స్పందన స్థానిక తెలుగుదేశం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. బాబు సొంత జిల్లాలోనే స్పందన ఇంత స్థాయిలో ఉండటాన్ని అస్సలు ఊహించలేదంటున్నారు.