ఒక పార్టీ అధినేతగా ఉండటం అంటే చిన్న విషయంకాదు. వారి మీద చాలానే బాధ్యతలు.. భారాలు ఉంటాయి. క్షణం తీరిక లేని రీతిలో కార్యక్రమాలు ఉంటాయి. బిజీ షెడ్యూల్ లో కుటుంబానికి ఏ మాత్రం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. అనునిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు చాలానే త్యాగాలు చేస్తుంటారు.
అనునిత్యం ప్రజలతోనూ.. క్యాడర్ తోనూ ఉండే అధినేతలు.. ఏడాదికి ఒకసారి కుటుంబంతో సహా విహారయాత్రలకు వెళ్లటం మామూలే. తాజాగా అలాంటి పనే చేశారు ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత నెల 25న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు.
దాదాపు రెండు వారాల పాటు కుటుంబంతో గడిపిన జగన్.. తాజాగా తన విదేశీ పర్యటనను ముగించి స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన జగన్‌కు స్వాగతం పలికేందుకు పలువురు నేతలు విమానాశ్రయానికి చేరుకుని, స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఘటనలపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కురిసిన ఓ మోస్తరు వర్షానికి ఏపీ అసెంబ్లీ.. సచివాలయ భవనం లీకేజీ కావటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఏపీ ప్రజలు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/