మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్... అప్పటి వరకూ నో ప్రాబ్లమ్!

రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు తరుపున సీనియర్ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా.. బిగ్ రిలీఫ్ దక్కింది.

Update: 2024-12-11 10:41 GMT

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ రచ్చకెక్కి, మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో మీడియా ప్రతినిధులపైనా దాడులు చేశారు. మరోపక్క చిరిగిన చొక్కాతో కనిపించిన మనోజ్ పై బౌన్సర్లు దాడి చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు నోటీసులు అందించారు.

ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్ లకు పోలీసులు నోటీసులు అందించారు. అయితే.. ఈ నోటీసులపై మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా... రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు తరుపున సీనియర్ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా.. బిగ్ రిలీఫ్ దక్కింది.

అవును... మోహన్ బాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. రాచకొండ పోలీసులు జరీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకూ మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

మరోవైపు... మనోజ్ మాత్రం రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి మీడియాకు సారీ చెప్పారు. ప్రచారం జరుగుతున్నట్లు తన తల్లి హాస్పటల్ లో లేరని.. తన భార్య మౌనిక, పిల్లలతో ఆమె ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. అబద్ధపు ప్రచారాలు వద్దని సూచించారు! తన తండ్రికి ఏమీ తెలియదని.. విష్ణు ప్రోత్బలంతోనే ఇదంతా జరుగుతుందని అన్నారు!

కాగా... మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో మోహన్ బాబు చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది ఆస్పత్రి బృందం. ఆందోళన, ఒళ్లు నొప్పులు, ముఖంపై చిన్న దెబ్బ మొదలైన కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపారు!

Tags:    

Similar News