మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రంలో 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చబోతున్నారని తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని గతంలోనే జగన్ ప్రకటించారు. ఆ మేరకు త్వరలోనే చర్యలు తీసుకోనున్నారని పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. త్వరలోనే జిల్లాల విభజన ఉంటుందని సీఎం జగన్ మంగళవారం చిన్న హింట్ ఇచ్చారు.
ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేసే ఆలోచనలో జగన్ ఉన్నారు. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం లోక్‌సభ స్థానాలు 25 ఉన్నాయి. ఆ మేరకు 13 జిల్లాలను కాస్త 25 జిల్లాలుగా మార్చనున్నారు. తెలంగాణలో మూడేళ్ల కిందటే జిల్లాల విభజన చేశారు. అప్పుడే జగన్ జిల్లాల విభజనపై ఆలోచన చేశారు. అనంతరం ఎన్నికల సమయంలో ప్రకటించారు. దానికి తోడు మ్యానిఫెస్టోలో కూడా చేర్చారు.
పరిపాలన వికేంద్రీకరణకు మొదటి నుంచి మొగ్గు చూపుతున్న సీఎం జగన్ ఆ మేరకు జిల్లాల విభజన చేసి ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ జిల్లాల విభజన వార్త మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కార్ఫరెన్స్‌లో చర్చకు వచ్చింది. సీఎం జగన్ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని సమావేశంలో అధికారులకు సీఎం వివరించారు. జిల్లాకు ఒక బోధన ఆస్పత్రి ఏర్పాటు అంశంపై ఏర్పాటుచేసిన సమావేశంలో జగన్ కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి సూచనతో అధికారులు జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇప్పుడు ఉన్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాలు ఏర్పడి త్వరలోనే మొత్తం 25 జిల్లాలు కానున్నాయి.