రాజధాని ఫై సీఎం కీలక నిర్ణయం ... అయోమయంలో ప్రతిపక్షాలు !

Update: 2020-01-20 02:33 GMT
ఏపీకి మూడు రాజధానుల కథ కంచికి చేరింది. రాజధానిగా అమరావతి విషయంలో నేడు తుది నిర్ణయం వెల్లడించేందుకు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధమయ్యారు. ఏపీలో బలమైన మెజార్టీ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎవరు అవునన్నా - కాదన్నా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకువెళ్తుంది.

అయితే, ఇక్కడే సీఎం జగన్ తన రాజకీయ చాణిక్యతని చూపించబోతున్నారు. అదేమిటంటే ..?

రాజధాని ని విశాఖకి తరలించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారని తెలుస్తుంది..కానీ , ఈ తరలింపును నేరుగా చెయ్యకుండా రాజధాని తరలింపు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా చెయ్యాలని వైసీపీ సర్కార్ భావిస్తుంది

అదెలా అంటే ? అసెంబ్లీ లో  ప్రవేశ పెట్టబోయే బిల్లుల్లో రాజధానిగా అమరావతి ఉండబోదని ఎక్కడా చెప్పటం లేదు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటానికి రూట్ ఎలా మార్చుకున్నారో అదే విధంగా నేడు చేసే ప్రకటనలో కూడా చాలా జాగ్రత్తగా రూటు మార్చి ప్రకటన చెయ్యనుంది వైసీపీ సర్కార్ . రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి జోనల్ కమీషనరేట్ లను ఏర్పాటు చేసి పాలన ఎక్కడికక్కడ సాగేలా చేస్తామని చెప్పనున్నారని సమాచారం. విశాఖకు రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ రాజధాని తరలింపు అనే మాట వాడకుండా జాగ్రత్త పడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాజధాని తరలిస్తున్నామని చెబితే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు రూ. నాలుగు లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. రాజధాని తరలిస్తున్నామనే మాట లేకుండా పని పూర్తి చెయ్యాలని సీఎం జగన్ సరికొత్త వ్యూహం తో ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.
 
 సీఎం జగన్ రాజధాని అమరావతి విషయంలో రాజధానిగా అమరావతి రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే - లేదా రాజధాని తరలిస్తున్నట్టు ప్రకటిస్తే రాజధాని ప్రాంత రైతులు - ప్రజలు ఊరుకోరు . ఈ నేపధ్యంలో వారికి నష్ట పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తం చెల్లించటం చాలా కష్టం .  అలాగే ఆందోళనలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ నేపధ్యంలోనే ఎక్కడా రాజధాని అమరావతి తరలింపు ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడనున్న జగన్ చాలా పెద్ద స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ వ్యూహంతో త్రిశంకు స్వర్గంలో రాజధాని అమరావతి పడిందని చెప్పాలి . ఇక ఇప్పుడు రాజధానిగా అమరావతి ఉన్నట్టా .. లేనట్టా .. ఉండీ లేనట్టా ? అన్నది అర్ధం కాక రాజధాని రైతులు డైలమాలో  పడనున్నారు. అలాగే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలు సైతం ఆలోచనలో పడ్డాయి.
Tags:    

Similar News