కరోనా వ్యాప్తి - జగన్ మరో సంచలన నిర్ణయం

Update: 2020-07-19 14:53 GMT
దేశంలోనే అత్యధిక టెస్టులతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా సమకూర్చుకున్న ఏపీ వైద్య సదుపాయాల కల్పనలో, కోవిడ్ పరీక్షల్లో చాలా ముందంజలో ఉందని ఇప్పటికే పలువురి ప్రశంసలు అందుకుంది. తాజాగా టెస్టుల విషయంలో మరో కీలక అడుగు పడింది.

ఏపీ ప్రభుత్వం ఇక నుంచి ఇంటికే వెళ్లి టెస్టులు చేయనుంది. ఇది దేశంలోనే ప్రథమం. అయితే, ప్రజలు లక్షణాలున్న వారు గాని, అనుమానం ఉన్న వారు గా తమ వివరాలను తెలుపుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. ఇది కూడా చాలా సులువైన పద్ధతే. కేవలం మీ పేరు, ఆధార్ నెంబరు,  చిరునామాతో పాటు మీకు ఏమైనా లక్షణాలుంటే చెబితే సరిపోతుంది. ఆన్ లైన్లో అప్లై చేసిన 24 గంటల్లో ఇంటికి వచ్చి స్వాబ్ టెస్టు కోసం శాంపిల్ సేకరిస్తారు.

ప్రతి ఒక్కరికి టెస్టులు అందుబాటులో ఉండేలా చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా... ఈరోజు ఏపీలో 5 వేల కేసులు దాటిపోయాయి. ఒక్కరోజులో 56 మరణాలు సంభవించాయి.

దరఖాస్తు చేసుకోవడానికి వెబ్ లింకు - https://covid-andhrapradesh.verahealthcare.com/person/register
Tags:    

Similar News