తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఆయన పాలనలో జరిగిన అనేక అక్రమాలపై త్వరలోనే విచారణ ప్రారంభం అవుతుందని.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్ కోసం.. జైల్లో గదిని కూడా సిద్ధం చేసి ఉంచామని ఆయన నిప్పులు చెరిగారు.
బీజేపీ కార్యకర్తలు, నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టి.. జైళ్లకు తరలిస్తున్నారని.. ఇది దారుణమని అన్నారు. అందుకే.. ఆయనను కూడా త్వరలోనే జైలుకు పంపిచాలని కార్యకర్తలు కోరుతున్నారని.. అందుకే చర్లపల్లి, చెంచల్‌గూడ జైళ్లలో రూములను సిద్ధం చేసి ఉంచారని వ్యాఖ్యానించారు.
బీజేపీ సభలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం కోసం పనిచేసేవారికి అప్పుడప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయన్నారు. ధర్మం కోసం పరితపించేవారు దేనికీ భయపడరని చెప్పారు. ధర్మం కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడవద్దని ఆయన సూచించారు. ధర్మం కోసం పనిచేసే తన కార్యకర్తలపై పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నామన్నారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. కేసీఆర్ ఆయన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ‘‘మనం ధర్మం కోసం పనిచేద్దాం’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జెండాలు పక్కనపెట్టి పోరాడామన్నారు.
ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ సర్కార్‌ను ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర 3 విడతలు పూర్తిచేశామన్నారు.
తెలంగాణ ఏర్పాటులో బీజేపీది ప్రధాన భూమిక వుందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని చెప్పారు. వరంగల్‌లో ఆస్పత్రి ఏర్పాటుకు కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. ప్లేస్, టైమ్ కేసీఆర్ డిసైడ్ చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చిద్దామన్నారు.