టీఆర్ ఎస్ పార్టీ బంపర్ మెజార్టీలో అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఎదురులేని శక్తిగా మరోసారి అవతరించింది. కాగా కొన్నిచోట్ల సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు తప్పడం లేదు. కేసీఆర్ ఒక వైపు ప్రతిపక్షాలను కుదేలు చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాడు. అదేవిధంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ లో మొదలైన వర్గపోరుకు ఎలా చెక్ పడుతారనే చర్చ సాగుతుంది.
నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి సెగ్మెంట్ టీఆర్ ఎస్ లో వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి - మాజీ ఎమ్మెల్సీ జైపాల్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు మళ్లీ రొడ్డెక్కింది. నువ్వా నేనా అనేరీతిలో ఇద్దరు నేతలు వర్గపోరుకు తెరలేపుతున్నారు. ఈక్రమంలోనే కల్వకుర్తి సెగ్మెంట్ టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసాగా మారింది. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డిని మాజీ ఎమ్మెల్సే జైపాల్ యావ్ వర్గం అడ్డుకోవడం వివాదం చెలరేగింది. కసిరెడ్డిపై కుర్చీలతో దాడిచేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని కసిరెడ్డిని అక్కడి నుంచి పంపివేయడంతో గొడవ సర్దుమణిగింది.
ఈ నేతల మధ్య ఆధిపత్య ఇప్పటిది కాదని ఎన్నో ఏళ్లుగా వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి పలుమార్లు వీరికి నచ్చజెప్పినా వీరి మధ్య వివాదం సర్దుమణగలేదు. తాజా జరిగిన ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.
ఇటీవలే కేటీఆర్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రెండోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉండాలని - శ్రేణులకు అహంకారం ఉండొద్దని చెబుతున్నారు. ప్రజలను మెప్పించేలా పాలన కొనసాగించాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ అధిష్టానం వీరిద్దరికి మొట్టికాయలు వేస్తుందా లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనే చర్చ జోరుగా సాగుతుంది. కల్వకుర్తి గులాబీ పంచాయతీని కేటీఆర్ ఏవిధంగా చూస్తారో వేచి చూడాలి.