పేద‌లు జ‌మ చేసింది రూ.26వేల కోట్లా?

Update: 2015-11-06 09:59 GMT
భార‌త‌దేశం పేద దేశం ఏమిటి? అని చాలామంది ప్ర‌శ్నిస్తారు. నిజ‌మే.. భార‌త‌దేశం పేదది కాదు.. భార‌తీయులు మాత్ర‌మే పేద‌వారు. ఎందుకంటే.. ఎంతో సంప‌ద ఇక్క‌డ పోగుప‌డి ఉంది. గుట్ట‌లుగుట్టులుగా పోగుప‌డిన‌ట్లుగా సంప‌ద కొన్ని వ‌ర్గాల చేతుల్లో ఉండ‌టం ఈ దేశానికి ఒక శాపంగా చెప్పొచ్చు.

ఒక‌ప్ప‌టి భార‌త‌దేశానికి.. ఇప్ప‌టికి చాలానే తేడా ఉంద‌ని.. పేద‌వారి జీవ‌నస్థాయి మారింద‌న్న మాట‌ను నిజం చేసే ఒక ఉదాహ‌ర‌ణ‌ను ప్ర‌ధాని మోడీ తాజాగా చెప్పుకొచ్చారు. భార‌త‌దేశంలోని ప్ర‌జ‌లంద‌రికి బ్యాంక్ అకౌంట్ ఉండాల‌ని.. మ‌రి ముఖ్యంగా పేద‌ల‌కు ఉండాల‌న్న‌ది మోడీ ఆకాంక్ష‌. పేద‌ల‌కు బ్యాంక్ అకౌంట్ ఉంటే.. సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన సొమ్మును వారి బ్యాంక్ అకౌంట్ కు మ‌ళ్లితే.. మ‌ధ్య‌లో అవినీతి అన్న మాటే ఉండ‌దు. ఇందులో భాగంగా జ‌న్‌ ధ‌న్ యోజ‌న పేరుతో ఆయ‌నో కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌టం తెలిసిందే.ఈ కార్య‌క్ర‌మానికి దేశ వ్యాప్తంగా భారీ స్పంద‌న ల‌భించింది.

బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు భార‌తీయులు క్యూ క‌ట్టారు. ఇంత‌కాలం బ్యాంక్ ఖాతా లేని.. గ్రామీణులు.. పేద‌లు సైతం త‌మ‌కు బ్యాంక్ ఖాతా తెరుచుకోవ‌టానికి మ‌క్కువ చూపారు. ప‌ది రూపాయిలు అయినా బ్యాంకులో దాచుకోవ‌చ్చ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. వారు త‌మ ద‌గ్గ‌ర ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో జ‌మ చేశారు. అలా జ‌మ చేసిన మొత్తాన్ని క‌లిపి కూడితే అదెంత అవుతుందో తెలుసా..? అక్ష‌రాల రూ.26వేల కోట్లుగా చెబుతున్నారు. పేద‌లు. గ్రామీణ‌లు త‌మ‌కు తాముగా ఎవ‌రికి ఒత్తిడి లేకుండా బ్యాంకుల్లో దాచుకున్న మొత్తం విలువ ఇంత భారీగా ఉండ‌టం అవాక్కు అయ్యేలా చేస్తోందన‌టంతో సందేహం లేదు. అంతేకాదు.. కేవ‌లం 17 నెల‌ల వ్య‌వ‌ధిలో 190 మిలియ‌న్ల (19 కోట్ల‌) మంది బ్యాంకు ఖాతాలు కొత్త‌గా తెర‌వ‌టం విశేషంగా చెప్పొచ్చు. ఒక‌.. జ‌న‌ధ‌న యోజ‌న ద్వారా దేశ జ‌నాభాలో సుమారు 15 శాతం మంది బ్యాంకు ఖాతాలు తెరిస్తేనే రూ.26వేల కోట్ల మొత్తం బ్యాంకుల‌కు చేరితే.. మ‌రింత మంది చేరితే..?
Tags:    

Similar News