మీరు చదివింది నిజమే. కాంగ్రెస్ కొట్టుకుపోతుందన్న మాట తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి నోటి నుంచే వచ్చింది. కాంగ్రెస్ కు వీర విధేయుడైన జానారెడ్డి నోటి నుంచి అంత మాటా? అన్న అనుమానం అక్కర్లేదు. ఆయన అదే మాటను అనేశారు కాకుంటే.. దానికి కొన్ని కండీషన్లు ఉన్నాయి. మొన్నామధ్య తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టుల గరించి ప్రస్తావించిన జానా.. సీఎం చెప్పినట్లుగా కోటి ఎకరాలకు నీరు కానీ ఇస్తే తాము కొట్టుకుపోవటం ఖాయమని తేల్చేశారు.
అయితే.. తప్పుడు మాటల్ని ప్రచారం చేస్తే మాత్రం .. ఆ ప్రచారహోరులోనే టీఆర్ ఎస్ కూడా కొట్టుకుపోతుందన్న వ్యాఖ్యను జానారెడ్డి చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మీద ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టిన కేసీఆర్ తీరును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. తెలంగాణలో అసహ్యకర రాజకీయాలకు టీఆర్ ఎస్ చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ కు ధీటుగా.. తాము కూడా బ్రహ్మండమైన ప్రజంటేషన్ ను ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జానారెడ్డి మాటల్ని ఉటంకిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ కొట్టుకుపోవటం ఖాయమని టీఆర్ ఎస్ నేతలు వ్యాఖ్యానించటం గమనార్హం.