జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ప్రకటనను చేశారు.తాజాగా గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో భావోద్వేగంతో మాట్లాడిన ఆయన.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఇద్దరు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఆసక్తిని రేకెత్తించారు. మిగిలిన పార్టీల మాదిరి కాకుండా.. సమయం. . సందర్భం.. బలమైన నేతలుగా ఉన్న వారిని ఎక్కడికక్కడ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించటం ద్వారా తనపై ఉండే భారాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు.
మిగిలిన పార్టీల మాదిరి పార్టీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను విడుదల చేసే కంటే.. తాను పాల్గొనే బహిరంగ సభల్లోనే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించటం ద్వారా.. పోటీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవటానికి పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
తాజాగా పవన్ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల విషయానికి వస్తే.. అందులో ఒకరు పవన్ కు అత్యంత సన్నిహితంగా.. ఆయన వెంట ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్న నాదెండ్ల మనోహర్ కాగా.. మరొకరు పవన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే తోట చంద్రశేఖర్ పేర్లను వెల్లడించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెంట్ల మనోహర్ బరిలోకి దిగనున్నారు. ఇక.. గుంటూరు ఎంపీగా తోటచంద్రశేఖర్ పోటీ చేయనున్నారు.
రానున్న రోజుల్లో తాను నిర్వహించే సభల్లోనే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అభ్యర్థుల పేర్లను ప్రకటించాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. అనవసరమైన సందేహాలకు.. చిక్కుముడులకు.. ఆశావాహులకు చెక్ చెప్పినట్లుగా అవుతుందని చెప్పక తప్పదు.