మాటెత్తితే.. కేంద్ర హోం శాఖ పేరు ఎత్తుతున్నాయట జనసేన, బీజేపీ వర్గాలు. స్థానిక ఎన్నికల్లో ఈ పార్టీలు పోటీ చేసింది చాలా పరిమితమైన చోట్ల మాత్రమే. అలాంటి చోట కూడా ఏదైనా రచ్చ జరిగినప్పుడు, ఏదైనా రాద్ధాంతం చేయాల్సి వచ్చినప్పుడు ఈ రెండు పార్టీల నేతలూ కేంద్ర హోం శాఖ తమ జేబులో ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారట! ఆఖరికి చోటా మోటా నేతలు కూడా.. కేంద్ర హోం శాఖ పేరు ఎత్తుతుండటం క్షేత్ర స్థాయిలో కామెడీగా మారింది.
ఒక రకమైన బెదిరింపు ధోరణితో.. కేంద్ర హోం శాఖ ప్రస్తావన తీసుకు వస్తున్నారట జనసేన, బీజేపీ నేతలు. తమను అడ్డుకుంటే.. అంతు చూస్తామన్నట్టుగా, తమను అడ్డుకుంటే ఢిల్లీ నుంచి ఆర్డర్లు వచ్చేస్తాయన్నట్టుగా ఈ నేతలు కామెడీ చేసేస్తూ ఉండటం గమనార్హం.
కేంద్ర హోం శాఖ మంత్రి అయిన బీజేపీ ముఖ్య నేత అమిత్ షా పేరును వీళ్లు ఇలా వాడుకుంటూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ పేరును కూడా వీరు వాడటం లేదు కానీ, అమిత్ షా పేరును మాత్రం గల్లీ లీడర్లు కూడా ఏపీలో విపరీతంగా వాడేస్తూ ఉండటం గమనార్హం. అక్కడ జరిగే గొడవలు, జరిగే రచ్చలు కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకునేంత స్థాయి కాదు కదా, స్థానిక ఎస్ఐ స్థాయివే! అయితే జనసేన - బీజేపీ నేతలు మాత్రం మాటెత్తితే అమిత్ షా - కేంద్ర హోం శాఖ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారట!
స్థానిక సంస్థల ఎన్నికల గల్లీ గొడవల్లో ఇదో కామెడీ అయిపోయినట్టుగా ఉంది. అయితే బీజేపీ వాళ్ల కన్నా జనసేన వాళ్లు కేంద్ర హోం శాఖ ప్రస్తావన ఎక్కువగా తెచ్చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. అమిత్ షా తమకు దగ్గరి బంధువు అన్నట్టుగా జనసేన నేతలు కామెడీ చేస్తున్నారట క్షేత్ర స్థాయిలో. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఏం తక్కువ కాదు.
ఆయన కూడా స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరుపై విరుచుకుపడుతూ ఉన్నారు కదా, ఆయన కూడా కేంద్ర హోం శాఖ ప్రస్తావన తెచ్చారు. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని, దీన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్.. ఈ విషయంలో తను కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా కూడా ఒక మాట అనేశారు. మొత్తానికి జనసేనకు కేంద్ర హోం శాఖ చాలా దగ్గర అయిపోయినట్టుగా ఉంది. అన్నింటికీ ఆ పేరును ఉపయోగించేస్తూ ఉన్నట్టున్నారు ఆ పార్టీ నేతలు!