సేనాని యాత్ర : జన హృదయాలను తాకేలా...?

Update: 2022-05-22 03:30 GMT
ఇది యాత్రల సీజన్. ఎన్నికలు ఇంకా ఎంత దూరంలో ఉన్నాయి అంటే ఒకరు ఏడాది అంటారు, మరొకరు రెండేళ్ళు అంటారు. ముందస్తు ఎపుడైనా రావచ్చు అని అంతా ఊహిస్తున్న వేళ టీడీపీ జోరు పెంచేసింది. ఏడు పదులు దాటిన వయసులో చంద్రబాబు జిల్లాల టూర్లు చేపడుతున్నారు. అలుపెరగని తీరున ఆయన రాత్రీ పగలూ తిరుగుతూ అటు జనాలనూ ఇటు క్యాడర్ ని ఉత్సాహపరుస్తున్నారు.

మరో వైపు చూస్తే బాదుడే బాదుడు అంటూ టీడీపీ క్యాడర్ అంతా ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టి జనాలలోకి వెళ్తున్నారు. దీనికి పోటీగా అన్నట్లుగా వైసీపీ గడపగడపకూ అంటూ కార్యక్రమం తీసుకుంది. ఇక మంత్రుల బస్సు యాత్ర ఎటూ ఉంది. మొత్తానికి అధికార విపక్షాలు రెండూ ఢీ అంటే ఢీ అన్నట్లుగా జనాలలోనే తేల్చుకుందామని చూస్తున్నాయి.

ఈ సమయంలో మూడవ పక్షంగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జనసేన ఏం చేస్తుంది అన్న ప్రశ్నకు ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన జవాబు ఆసక్తికరంగా ఉంది. ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఇష్టాగోష్టిగా అనేక అంశాలను గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు మీ యాత్ర ఎపుడు. ఉంటుందా అని అడిగిన దానికి జనసేనాని బదులిస్తూ యాత్ర ఉంటుంది అని చెప్పడం విశేషం. అది జనాల హృదయాలను తాకే విధంగా ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు.

దీని బట్టి చూస్తూంటే పవన్ కళ్యాణ్ కూడా యాత్ర చేపడతారా. చేపడితే అది ఏ రూపంలో ఉంటుంది అన్నది చర్చగా ఉంది. అదే విధంగా పవన్ జన హృదయాలను తాకేలా యాత్ర అంటున్నారు. అంటే పాదయాత్రగా ఉంటుందా అన్నది చూడాలి. పాదయాత్ర అయితేనే జనాల వద్దకు నేరుగా ఎవరైనా వెళ్ళగలరు. మరి పవన్ ఆ దిశగా ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా అన్నది చూడాలి.

అదే కనుక జరిగితే పవన్ ఆ నిర్ణయమే తీసుకుంటే కచ్చితంగా ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే అతి పెద్ద పొలిటికల్ మూవ్ అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ పాదయాత్ర చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే పవన్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ వల్ల ఆయన కనుక జనం మధ్యకు వస్తే ట్రాఫిక్ ని అదుపు చేయడం కష్టమని కూడా అభిప్రాయాలు ఉన్నాయి.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ యాత్ర అని ఒక హింట్ ఇచ్చారు. మరి అది పాదయాత్ర అయ్యెనా.. లేక  బస్సు యాత్రగా మారేనా. లేక  అప్పట్లో ఎన్టీయార్ చైతన్య రధం మీద రాష్ట్రాన్ని చుట్టిన తీరున రధ యాత్ర  అన్నది మాత్రం చర్చగా ఉంది. చూడలి మరి దీని మీద జనసేన నుంచి ఏ రకమైన అప్ డేట్ ఉంటుందో.
Tags:    

Similar News