బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ పై రచ్చ మొదలైంది. ఆ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ ను కూడా కుదిపేస్తుంది. పార్లమెంట్ సమావేశాలలోనూ చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారం పై మొదటగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ..సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని, దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయని, పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్ చెప్పారు.
ఈయన వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండి పడ్డారు. కొందరి కోసం అందరిని విమర్శించడం తగదన్నారు. జయా బచ్చన్ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘కొంతమంది వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చడం సరి కాదు. నిన్న లోక్‌సభలో పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడంతో నేను ఎంతో సిగ్గు పడ్డాను. ఆయన వ్యాఖ్యలు చూస్తే.. అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది’ అంటూ తీవ్రంగా మండి పడ్డారు జయా బచ్చన్. సినీ రంగానికి ప్రభుత్వ మద్దతు కావాలని , నిన్న పార్లమెంట్లో బిజెపి ఎంపి చేసిన వ్యాఖ్యలను, సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ పై కంగనా రనౌత్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ జయాబచ్చన్ ఈ వ్యాఖ్యలు చేసారు.
అయితే , తన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన జయాబచ్చన్ వ్యాఖ్యలని బీజేపీ ఎంపీ, బహుబాషా నటుడు రవికిషన్ తిప్పికొట్టారు. పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం కృషితో తాను పైకి వచ్చానని, పరిశ్రమను పూర్తిగా తుడిచిపెట్టేసే కుట్ర జరుగుతోంది. చిత్ర పరిశ్రమకే చెందిన బాధ్యత కలిగిన నటుడిగా నేను స్పందించాను. అది నా హక్కు. అలాగే పార్లమెంటులో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించాను. నా అభిప్రాయాన్ని జయాబచ్చన్ సైతం గౌరవించాలి. నేను ఓ ప్రీస్ట్ కుమారుడిని. కష్టపడి పైకి వచ్చి 600 సినిమాలకు పనిచేశా అని రవి కిషన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నేను చెప్పిన విషయానికి జయాబచ్చన్ కూడా మద్దతిస్తారని అనుకుంటున్నాను. పరిశ్రమలో అంతా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పడం లేదు. ప్రపంచంలోని అతి పెద్ద చిత్ర పరిశ్రమను సర్వనాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్న వారి గురించే నేను మాట్లాడుతున్నాను. పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
అలాగే జయాబచ్చన్ వ్యాఖ్యల పై కంగనా రనౌత్ కూడా తనదైన శైలిలో స్పందించింది. ఈ వ్యవహారంలో మొదటి నుంచి తన అభిప్రాయాలను, బాలీవుడ్ ప్రముఖుల పై తన ఆరోపణలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతోంది ఒక్క కంగనా మాత్రమే. బాలీవుడ్ ప్రముఖులకు మద్దతుగా నిలుస్తోంది అంటూ మహారాష్ట్ర సర్కార్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా పార్లమెంట్ లో జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కంగనా ..జయా జీ ... నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉంటే మీరు ఇలాగే మాట్లాడేవారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా జయ బచ్చన్ వ్యాఖ్యల పై మండిపడిన కంగనా రనౌత్ మీ కూతురు శ్వేత టీనేజ్ లో నాలా బాలీవుడ్ లో దెబ్బలు తిని, డ్రగ్స్ కి అలవాటు పడి, లైంగిక వేధింపులకు గురైతే మీరు ఇలానే మాట్లాడతారా , సుశాంత్ లా మీ కొడుకు అభిషేక్ బచ్చన్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా... మా పై కూడా కాస్త దయ చూపండి అంటూ కంగనారనౌత్ జయా బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించింది. కంగనారనౌత్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ పై జయా బచ్చన్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.