జేసీ దూకుడు వల్లే వివాదం ముదిరిందా?

Update: 2018-09-18 08:40 GMT
అనంత‌పురం జిల్లాలోని చిన్న‌పొడ‌మ‌ల‌లో శ‌నివారం నాడు వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్ప‌డిన స్వ‌ల్ప వివాదం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ఆ గ్రామంలో ప్రబోధానంద స్వామి వర్గీయులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జ‌ర‌గ‌డంతో.. జేసీ వ‌ర్గానికి చెందిన ఒక వ్య‌క్తి  చ‌నిపోయారు. దీంతో, అక్క‌డ 144 సెక్ష‌న్ విధించారు. అయితే, పోలీసుల వైఫ‌ల్యం వ‌ల్లే త‌న అనుచ‌రుడు చ‌నిపోయాడ‌ని జేసీ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త పోలీసుల‌దేనంటూ పోలీస్ స్టేష‌న్ ఎదుట బైఠాయించారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై మ‌రో వాద‌న వినిపిస్తోంది.  ప్రబోధానంద స్వామి ఆశ్ర‌మం ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన జేసీని పోలీసులు అడ్డుకున్నార‌ని తెలుస్తోంది. అయితే, వారి మాట విన‌ని జేసీ...త‌న ప్రైవేటు భ‌ద్ర‌తా సిబ్బందితో క‌లిసి ఆశ్ర‌మం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో గొడ‌వ పెద్ద‌ద‌యింద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జేసీ వ‌ర్గీయులు, గ్రామస్థులు....ఆశ్ర‌మ వ‌ర్గాల‌కు మధ్య జ‌రిగిన రాళ్ల దాడిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా ...మ‌రొకరి కోమాలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో చాలామంది గాయ‌ప‌డ్డారు.

జేసీ దూకుడు వ‌ల్లే ఈ వివాదం చినికిచినికి గాలివాన అయింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న‌ప్ప‌టికీ జేసీ ఆశ్ర‌మం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం వ‌ల్లే వివాదం పెద్ద‌ద‌యింద‌ని ఆశ్ర‌మ‌వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. జేసీ త‌న అనుచ‌రుల‌తో ఆశ్ర‌మం వ‌ద్ద‌కు రాగానే ఆశ్ర‌మంలోని వారు వారి వాహ‌నాల‌పై రాళ్లు రువ్వారు. దీంతో, జేసీ వ‌ర్గీయులు గాయ‌ప‌డ్డారు. ఆ క్ర‌మంలో జేసీని అక్క‌డి నుంచి పోలీసులు త‌ప్పించారు. అయితే, అప్ప‌టికే జేసీ అనుచ‌రుడు మృతి చెందాడు. 50మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉంటే ఈ ఘ‌ట‌న‌కు నైతిక బాధ్య‌త పోలీసుల‌దేన‌ని జేసీ వ‌ర్గీయులు పోలీస్ స్టేష‌న్ ముందు బైఠాయించారు. కానీ, జేసీ అక్క‌డికి వెళ్ల‌కుండా ఉంటే....గొడ‌వ జ‌రిగేదికాద‌ని, ప్రాణ న‌ష్టంజ‌రిగి ఉండేది కాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News