ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటుతో తండ్రీ కొడుకులకు షాకిచ్చారు జేడీఎస్ ఎమ్మెల్యేలు. మాజీ ప్రధానిగా గుర్తుండిపోయే దేవగౌడ పార్టీకి చెందిన ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.. పార్టీకి వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లేశారు. దీంతో.. దేవగౌడ.. ఆయన కుమారుడు కుమారస్వామిలకు కోపం వచ్చేసింది. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఈ సందర్భంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టేసి.. పార్టీ అధినేతను.. ఆయన పుత్రరత్నాన్ని తమ మాటలతో దుమ్ము దులిపేశారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము ఓటు వేయటానికి పార్టీ అధినేత.. ఆయన పుత్రరత్నమేకారణమని.. వారి విధానాలు ఆ తీరులో ఉన్నాయంటూ మండిపడ్డారు. పార్టీ జారీ చేసినట్లు చెబుతున్న సస్పెన్షన్ నోటీసులు అందలేదంటున్న వారు.. గతంలో పార్టీ నిర్ణయానికి భిన్నంగా దేవగౌడ కుమారుడు కుమారస్వామి 2006లో పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించారని.. అప్పుడు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కొడుక్కి ఒక న్యాయం.. తమకు మరో న్యాయమా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తే.. దేవగౌడ.. ఆయన కుమారుడికి సంబంధించిన నిజాల్ని చెప్పాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తాము చనిపోయినట్లు పోస్టర్లు వేయటం.. తమ పెద్దకర్మల్ని నిర్వహిస్తున్నట్లుగా చేస్తున్న ప్రచారాన్ని తక్షణమే ఆపాలన్నారు. ఇన్ని చేస్తున్నా తాము కామ్ గా ఉంటున్నామంటే కారణం.. అది దేవగౌడ మీద తమకున్న అభిమానమేనని.. ఆయన వల్లే తాము రాజకీయంగా ఎదిగామని.. వారి ఇంట్లో భోజనం చేశామన్న విశ్వాసం తమకు ఇప్పటికి ఉందన్నారు. అందుకే తాము ఎలాంటి వ్యతిరేక కామెంట్లు చేయటం లేదన్నారు. మరింత విశ్వాసమే ఉండి ఉంటే.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓట్లు వేయటం ఎందుకో..?